It’s heart-wrenching: కారుణ్య మరణం కోసం కోర్టుకు.. ఇంతలోనే!

కంటికి రెప్పలా చూసుకుంటోన్న కొడుకు అరుదైన వ్యాధితో బాధపడుతుంటే.. చూసి తట్టుకోలేక కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోర్టుకు వెళ్లింది ఓ తల్లి. కోర్టుకు సెలవులు కావడంతో.. తిరిగి ఇంటికి వెళ్తుండగానే దారిలోనే కన్నుమూశాడు ఆమె కొడుకు.

It’s heart-wrenching: కారుణ్య మరణం కోసం కోర్టుకు.. ఇంతలోనే!

Illness Ridden Boy Dies: కంటికి రెప్పలా చూసుకుంటోన్న కొడుకు అరుదైన వ్యాధితో బాధపడుతుంటే.. చూసి తట్టుకోలేక కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోర్టుకు వెళ్లింది ఓ తల్లి. కోర్టుకు సెలవులు కావడంతో.. తిరిగి ఇంటికి వెళ్తుండగానే దారిలోనే కన్నుమూశాడు ఆమె కొడుకు. ఈ ఘటన చౌడేపల్లె మండలంలో చోటుచేసుకుంది. బీర్జేపల్లెకు చెందిన మణి, అరుణలకు హర్షవర్ధన్ అనే తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడు. నాలుగేళ్ల క్రితం స్కూలులో ఆడుకుంటూ పడిపోగా హర్షవర్ధన్‌ ముక్కుకు గాయమైంది.

గాయమైన ముక్కుతో ఆస్పత్రికి చేరగా.. ప్రాధమిక చికిత్స చేసిన డాక్టర్లు.. హర్షవర్ధన్ అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, ఆపరేషన్ చేస్తే భవిష్యత్తులో సమస్య ఉండదని సూచించారు. అప్పటి నుంచి నాలుగేళ్లుగా హాస్పిటళ్లు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు తల్లిదండ్రులు. నాలుగు లక్షల రూపాయలు వరకు ఖర్చు చేసినా కూడా వ్యాధి నయం కాకపోగా.. డబ్బు అంతా ఖర్చయిపోయింది. 20రోజుల క్రితం తండ్రి కూడా ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.

అరుదైన వ్యాధితో కన్నకొడుకు పడుతున్న బాధను చూస్తూ తట్టుకోలేక.. కడుపు తీపిని చంపుకొని కారుణ్య మరణానికి అనుమతివ్వాలని అర్జీ రాసుకుని పుంగనూరు కోర్టును కోరాలని వెళ్లింది తల్లి. కోర్టులకు సెలవు కావడంతో.. తిరిగి వస్తుండగా దారిలోనే కన్నుమూశాడు కొడుకు. కొడుకు మరణంతో తల్లి అరుణ కన్నీరుమున్నీరుగా విలపిస్తొంది.