TTD EO Dharma Reddy : టీటీడీ ఈఓ ధర్మారెడ్డి‎కి నెల రోజులు జైలు శిక్ష

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు నెల రోజులు జైలుశిక్ష విధించింది. ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీస్ రెగులరైజ్ చేయాలని ధర్మారెడ్డిని గతంలో న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలు అమలు కాలేదు.

TTD EO Dharma Reddy : టీటీడీ ఈఓ ధర్మారెడ్డి‎కి నెల రోజులు జైలు శిక్ష

TTD EO Dharma Reddy : టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు నెల రోజులు జైలుశిక్ష విధించింది. ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీస్ రెగులరైజ్ చేయాలని ధర్మారెడ్డిని గతంలో న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలు అమలు కాలేదు. దీంతో ధర్మారెడ్డి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన న్యాయస్థానం ధర్మారెడ్డికి నెల రోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే మరో వారం జైలుశిక్ష పొడిగించాలని ఆదేశించింది.

కోర్టు ఉత్తర్వులు అమలు చెయ్యలేదని టీటీడీ ఈవోకు జైలు శిక్ష విధించడం హాట్ టాపిక్ గా మారింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఈ తీర్పు వెలువరిస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

గతంలో టీటీడీలో పని చేస్తున్న ముగ్గురు తాత్కాలిక సిబ్బంది క్రమబద్దీకరణ కోసం కోర్టును ఆశ్రయించారు. ఆ ముగ్గురినీ క్రమబద్దీకరించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, కోర్టు ఆదేశాలు అమలు చేయలేదు. దీంతో ఉద్యోగులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు.. ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోర్టు ఉత్తర్వులు అమలు చెయ్యలేదంటూ టీటీడీ ఈవోకి నెలరోజుల శిక్ష విధించిన హైకోర్టు సింగిల్ బెంచ్. దాంతో పాటే రూ.2వేల జరిమానా విధించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులు 27వ తేదీలోపు అమలు చేయపోతే శిక్షా ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించింది. అయితే, ఈవోపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లనుంది టీటీడీ.