Rameshwar Rao Jupally : టీటీడీ పాలకమండలి సభ్యులుగా జూపల్లి రామేశ్వరరావు ప్రమాణ స్వీకారం

టీటీడీ పాలక మండలి సభ్యులుగా మై హోం గ్రూపు వ్యాపార సంస్థల ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

Rameshwar Rao Jupally : టీటీడీ పాలకమండలి సభ్యులుగా జూపల్లి రామేశ్వరరావు ప్రమాణ స్వీకారం

Rameshwar Rao

Updated On : October 7, 2021 / 8:48 AM IST

Rameshwar Rao Jupally : టీటీడీ పాలక మండలి సభ్యులుగా మై హోం గ్రూపు వ్యాపార సంస్థల ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. బంగారు వాకిలిలో ప్రమాణం చేసిన ఆయన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి చేతుల మీదుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.

టీటీడీ పాలక మండలి సభ్యులు జూపల్లి రామేశ్వరరావుకు రంగనాయకుల మండపం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. నవనీత సేవలో భాగంగా తిరుమల గోశాలకు వెళ్లారు రామేశ్వరరావు. గోసేవ అనంతరం సర్వులకు స్వామి అనుగ్రహం ఉండాలని కాంక్షిస్తున్నట్లు తెలిపారు.

……………………………………. : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు