AP CM : విద్యార్థులకు స్పూర్తి సీఎంఓ అదనపు కార్యదర్శి ముత్యాలరాజు…ఆయన ప్రస్థానం

స్ఫూర్తినిచ్చేలా ప్రస్థానాన్ని తెలియజేయాలంటూ సీఎం సూచించడంతో సీఎంఓ అదనపు కార్యదర్శి ముత్యాలరాజు విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు

10TV Telugu News

AP CM Additional Secretary Mutyala Raju : ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, గిరిజన రెసిడెన్షియల్‌ స్కూళ్ల నుంచి ఐఐటీ సహా ఇతర ఉన్నత విద్యా ప్రవేశాల కోసం పరీక్షలు రాసి ర్యాంకులు సాధించిన విద్యార్థులను సీఎం జగన్‌ అభినందించారు. క్యాంపు కార్యాలయంలో వీరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరినీ పరిచయం చేసుకున్న ఆయన..వారి నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపే అధికారులు మన ముందే ఉన్నారని, ఐఏఎస్‌ల్లో చాలామంది నేపథ్యాలు అత్యంత సాధారణమైనవని, సీఎంఓలో అదనపు కార్యదర్శిగా ఉన్న ముత్యాలరాజే దీనికి ఉదాహరణ అంటూ…ఇదంతా మీకు మంచి స్ఫూర్తినిస్తుందన్నారు.

Read More : AP : ఐఐటీ ర్యాంకర్లకు సీఎం అభినందన, కలెక్టర్ల స్థాయికి చేరుకోవాలి

ఈ సందర్భంగా….స్ఫూర్తినిచ్చేలా ప్రస్థానాన్ని తెలియజేయాలంటూ సీఎం సూచించడంతో సీఎంఓ అదనపు కార్యదర్శి ముత్యాలరాజు విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు. “కృష్ణాజిల్లాలో మాది చినగొల్లపాలెం. పల్లి. ఊరు ఒక దీవి. అటు పశ్చిమగోదావరి జిల్లాకు, ఇటు కృష్ణా జిల్లాకు కూడా ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. దీనివల్ల చాలామంది గర్భవతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. మా సొంత చెల్లెలే ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాను. ఈ పరీక్షల్లో నాకు అఖిలభారత స్థాయిలో నంబర్‌ ఒన్‌ ర్యాంకు వచ్చింది.

Read More : AP Government : టీటీడీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

అప్పటి సీఎం వైఎస్సార్‌ పిలిచారు. నా తల్లిదండ్రులతో వెళ్లి ఆయన్ని కలిశాను. ఏంకావాలని.. అప్పటి ముఖ్యమంత్రిగారు నన్ను అడిగారు. మా ఊరికి బ్రిడ్జి కావాలని చెప్పాను. నేను సివిల్స్‌ అధికారిగా రిటైర్‌ అయ్యేలోగా మా ఊరికి బ్రిడ్జి తీసుకురాగలనేమోనని అనుకున్నాను. వైఎస్సార్‌గారి వల్ల మూడేళ్ల కాలంలోనే బ్రిడ్జి వేయగలిగాం. దీనికోసం రూ.26 కోట్ల నిధులను ఆయన కేటాయించారు. అప్పటి నుంచీ విద్యా సంబంధిత అంశాలమీద దృష్టి పెట్టాను. ప్రస్తుత సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి, నాడు-నేడు కార్యక్రమాలు చురుగ్గా చేయగలిగాం. ఏపీ హిస్టరీలో ఎప్పుడూ కూడా ఇన్ని సీట్లు రాలేదు’ అంటూ ముత్యాలరాజు విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.

Read More : Kotia Villages : ఏపీలోనే ఉంటాం.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాల ప్రజలు

రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల నుంచి ఇప్పటివరకూ 179 మంది వివిధ ఐఐటీలు, ఐఐటీల్లో ప్రిపరేటరీ కోర్సులు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీట్లు సాధించారు. ఎస్టీ విద్యార్థుల్లో 9 మంది ఐఐటీలకు ఎంపికకాగా, 21 మంది ప్రిపరేటరీ కోర్సులకు, 59 మంది ఎన్‌ఐటీ, ఐఐఐటీ, ఇతర కేంద్ర విద్యాసంస్థలకు ఎంపికయ్యారు. ఎస్సీలనుంచి 13 మంది ఐఐటీలకు, 34 మంది ప్రిపరేటరీ కోర్సులకు, 43 ఎన్‌ఐటీ, ఐఐఐటీ, కేంద్ర విద్యాసంస్థలకు ఎంపికయ్యారు. ఇంకా కౌన్సిలింగ్‌ జరుగుతున్నందన మరింతమందికి ర్యాంకులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.