AP : ఐఐటీ ర్యాంకర్లకు సీఎం అభినందన, కలెక్టర్ల స్థాయికి చేరుకోవాలి

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, గిరిజన రెసిడెన్షియల్‌ స్కూళ్ల నుంచి ఐఐటీ సహా ఇతర ఉన్నత విద్యా ప్రవేశాల కోసం పరీక్షలు రాసి ర్యాంకులు సాధించిన విద్యార్థులను సీఎం జగన్ అభినందించారు.

10TV Telugu News

CM YS Jagan : దేవుడి దయవల్ల బాగా కష్టపడుతున్నారని, బాగా చదవగలుగుతున్నారని, దీన్ని ఇలాగే కొనసాగిస్తే, దృష్టి కేంద్రీకరిస్తే.. కచ్చితంగా ఈ ఐఏఎస్‌ల స్థానాల్లో కూర్చుంటారన్నారని సీఎం జగన్ విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, గిరిజన రెసిడెన్షియల్‌ స్కూళ్ల నుంచి ఐఐటీ సహా ఇతర ఉన్నత విద్యా ప్రవేశాల కోసం పరీక్షలు రాసి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. క్యాంపు కార్యాలయంలో వీరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరినీ పరిచయం చేసుకున్న ఆయన..వారి నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. సీఎం జగన్ మాట్లాడారు.

Read More : TDP Leader Pattabhi : కుటుంబంతో కలిసి బయటకు వచ్చా…త్వరలోనే వస్తా

విద్యారంగం మీద ప్రభుత్వాలు చూపించే శ్రద్ధ, ధ్యాస భవిష్యత్తును తీర్చిదిద్దుతాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అమ్మ-ఒడి, నాడు-నేడు సహా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని, అయితే…విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపే అధికారులు మన ముందే ఉన్నారన్నారు. మీ ముందే ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు కాంతిలాల్‌ దండే, సునీతలు ఉన్నారని, వీళ్లుకూడా మీలాంటి వాళ్లేనని తెలిపారు. షెడ్యూల్‌ కులాలకు చెందిన వారు… ఐఏఎస్‌ అధికారులు అయ్యారని వివరించారు. మీరంతా కూడా వీరి నుంచి స్ఫూర్తి పొందాలని విద్యార్థులకు సూచించారు. ఇది అసాధ్యం కానేకాదని, ఐఐటీ వరకూ చేరుకోగలిగిన మీరు.. ప్రపంచం మీకు మెరుగైన అవకాశాల రూపంలో ద్వారాలు తెరుస్తుందని సూచించారు. ఆ ప్రపంచంలో ఇప్పటికే మీరు ఒక స్థాయికి చేరుకున్నారని, మొట్టమొదటి అడుగు వేసినట్టే భావించాలని సూచించారు సీఎం జగన్.

Read More : Telangana : వ్యాక్సిన్‌కు పెన్షన్, రేషన్‌కు లింక్‌..సర్కార్ సీరియస్

ఐఏఎస్‌ల్లో చాలామంది నేపథ్యాలు అత్యంత సాధారణమైనవని, సీఎంఓలో అదనపు కార్యదర్శిగా ఉన్న ముత్యాలరాజే దీనికి ఉదాహరణ అంటూ…ఇదంతా మీకు మంచి స్ఫూర్తినిస్తుందన్నారు. ముత్యాలరాజు జీవితం… హృదయాలను కదిలిస్తుంది..వాళ్ల ఊరికి పోవాలంటే బోటులో పోవాలి. మనకు స్ఫూర్తినిచ్చే కథలు ఎక్కడో లేవు… ఇదే గదిలో ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల రూపంలో ఉన్నాయన్నారు. మీరు ఇదే కృషి కొనసాగిస్తే.. కచ్చితంగా మీరు ఈ స్థాయికి చేరుకుంటారని చెప్పిన సీఎం జగన్..తన పక్కనున్న స్థానాల్లో కనిపిస్తారన్నారు.

Read More : Badvel By-Election : ఏ ఎన్నికలు జరిగినా..వార్ వన్ సైడే

తన వైపు నుంచి సీఎంఓ అదనపు కార్యదర్శి ముత్యాలరాజు అందుబాటులో ఉంటారని, ఫోన్‌ నంబరు ఇస్తారని, ఎప్పుడు అవసరమున్నా.., ఏం కావాలన్నా.. సహాయంగా నిలుస్తారంటూ విద్యార్థులకు సీఎం భరోసానిచ్చారు. ఎలాంటి క్లిష్ట పరిస్థులున్నా.. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ అధికారులంతా మీ స్థాయినుంచే వచ్చారు కాబట్టి, ఎలాంటి సమస్యలు వస్తాయి? వాటిని ఎలా పరిష్కరించాలి? ఏరకంగా మీకు తోడుగా నిలవాలనే విషయాలు వీరికి బాగా తెలుసని సీఎం వారికి చెప్పారు. గిరిజన ప్రాంతాలనుంచి, అలాగే కర్నూలులోని ఎమ్మిగనూరు లాంటి ప్రాంతాలనుంచి ఐఐటీలు సాధించారంటే ఇది నిజంగా గర్వించదగ్గ విషయమంటూ విద్యార్థుల ప్రతిభను సీఎం కొనియాడారు.

Read More : East Godavari : పోలీసు, ఉద్యోగుల కళ్లలో కారం కొట్టిన మహిళా రేషన్ డీలర్

తాను పాదయాత్ర చేసినప్పుడు కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని ఎంత వెనకబడి ఉన్నాయో చూశానని ఆనాటి విషయాలను వెల్లడించారు. వెనకబడ్డ ప్రాంతాల్లో ఇది ఒకటి. అలాంటి ప్రాంతనుంచి కూడా ఇద్దరు, ముగ్గురు కలెక్టర్లు వస్తే మొత్తం వ్యవస్థే అక్కడ మారిపోతుందన్నారు. అక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు పెరుగడమే కాకుండా.. పెద్ద పెద్ద చదువులు చదవాలన్న తపన పెరుగుతుందన్నారు. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని, మార్గదర్శకంగా భావించి ఇంకా కొంతమంది మెరుగైన చదువులు చదివే పరిస్థితి వస్తుంది..ఇది మొత్తం మార్పే కనిపిస్తుందన్నారు. అభినందిస్తూ ప్రభుత్వం తరఫు నుంచి మీకు ల్యాప్‌టాప్స్‌ కూడా అందించామని, ఇంకా పైస్థానంలోకి వెళ్లాలని విద్యార్థులకు సూచించారు.