Telangana : వ్యాక్సిన్‌కు పెన్షన్, రేషన్‌కు లింక్‌..సర్కార్ సీరియస్

వ్యాక్సిన్ తీసుకోని వారికి వచ్చే నెల నుంచి రేషన్, పింఛన్ నిలిపేస్తామంటూ.. వచ్చిన ప్రకటనలో వాస్తవం లేదని తెలంగాణ ప్రజా వైద్య ఆరోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Telangana : వ్యాక్సిన్‌కు పెన్షన్, రేషన్‌కు లింక్‌..సర్కార్ సీరియస్

Covid Vaccine Tg

Vaccine Link To Ration And Pension : తెలంగాణలో వ్యాక్సిన్‌ విషయంలో డైరెక్టర్ ఆఫ్‌ హెల్త్ శ్రీనివాసరావు చేసిన ఓ ప్రకటన.. తీవ్ర గందరగోళాన్ని రేపింది. వ్యాక్సిన్ తీసుకోకుండా ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారిన వారి రేషన్‌, పెన్షన్ కట్‌ చేస్తామంటూ డీహెచ్‌ శ్రీనివాసరావు హెచ్చరించారు.. నవంబర్ 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందంటూ డేట్‌ కూడా చెప్పేశారు. అయితే..ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వ్యాక్సిన్ కు ముడిపెట్టి… నో రేషన్ స్టేట్ మెంట్ ఇవ్వడం ఏంటని ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించారు. పింఛన్లు ఆపివేస్తామని చెప్పడానికి మీరెవరు అంటూ డీహెచ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ పెద్దల ఆగ్రహంతో తన వ్యాఖ్యలను హెల్త్ డైరెక్టర్ వెనక్కి తీసుకున్నారు. మరోవైపు…ఫోన్ లో డీహెచ్ కు సీఎస్ సోమేష్ కుమార్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read More : Telangana : వ్యాక్సిన్‌‌కు పెన్షన్, రేషన్ లింక్..డీహెచ్ వ్యాఖ్యలపై గందరగోళం!

మరోవైపు… కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారికి వచ్చే నెల నుంచి రేషన్, పింఛన్ నిలిపేస్తామంటూ.. వచ్చిన ప్రకటనలో వాస్తవం లేదని తెలంగాణ ప్రజా వైద్య ఆరోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయమే తీసుకోలేదని చెప్పారు. ఇది తప్పుడు ప్రచారమన్నారు. ప్రజలు ఆందోళనకు గురికావద్దని కోరారు. అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం సీరియస్ అవ్వడంతో…డీహెచ్ ప్రకటనను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. డీహెచ్‌ వ్యాఖ్యలపై సివిల్ సప్లయ్‌ శాఖ అధికారులు మాత్రం భిన్నంగా స్పందించారు.

Read More : Vaccination: వ్యాక్సిన్ తీసుకోకుంటే రేషన్, పెన్షన్ ఇవ్వరు.. ఎప్పటినుంచో తెలుసా?

వ్యాక్సినేషన్‌తో తమకు సంబంధం లేదని.. రేషన్ ఆపాలని తమకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదన్నారు.. అటు సెర్ప్‌ అధికారులు ఈ విధంగానే స్పందించారు.. వ్యాక్సినేషన్‌తో పెన్షన్‌కు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 3 కోట్ల ఒక లక్షా 92 వేలకు పైగా డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తైంది. ఇందులో ఫస్ట్‌ డోస్‌ పూర్తి చేసుకున్నవారు 2 కోట్ల 14 లక్షల 6 వేల మందికి పైగా ఉండగా.. రెండు డోసులు తీసుకున్న వారు 87 లక్షల 86 వేలకు పైగా ఉన్నారు.