Badvel By-Election : ఏ ఎన్నికలు జరిగినా..వార్ వన్ సైడే

ఈ నెల 30వ తేదీన బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఫలితాలు నవంబర్ 02న విడుదల కానున్నాయి. బద్వేల్ ఉప ఎన్నిక ప్రచార సమయాన్ని 48 గంటల నుంచి 72 గంటలకు పెంచిన సంగతి తెలిసిందే.

Badvel By-Election : ఏ ఎన్నికలు జరిగినా..వార్ వన్ సైడే

Mla Roja

Nagari MLA Roja : ఏ ఎన్నికలు జరిగినా..వార్ వన్ సైడే అన్నారు నగరి ఎమ్మెల్యే రోజా. బద్వేల్ ఎన్నికల నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బద్వేల్ లో కూడా వైసీపీ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కులం, మతం ప్రాంతం అన్న బేధాలు లేకుండా సీఎం జగన్..ప్రతి మహిళకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారని తెలిపారు. అందరూ ఎన్నికల ప్రచారానికి వస్తారు..కానీ..తాము నైతికంగా గెలిచి మెజార్టీ తీసుకొచ్చామని, బీజేపీని అడ్డు పెట్టుకుని..కొన్ని పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేశారామె.

Read More : East Godavari : పోలీసు, ఉద్యోగుల కళ్లలో కారం కొట్టిన మహిళా రేషన్ డీలర్

ఈ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బద్వేల్ గడ్డ వైసీపీ అడ్డాగా మారాలన్నారు నగరి ఎమ్మెల్యే రోజా. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక ప్రచార సమయాన్ని 48 గంటల నుంచి 72 గంటలకు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో…అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు పార్టీలు ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య అకస్మిక మరణంతో ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ తరపున వెంకట సుబ్బయ్య సతీమణి సుధ బరిలో నిలవగా…బీజేపీ నుంచి పనతల సురేశ్, కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే కుతుహులమ్మ పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగనుండగా…ఫలితాలు నవంబర్ 02న విడుదల కానున్నాయి.