East Godavari : పోలీసు, ఉద్యోగుల కళ్లలో కారం కొట్టిన మహిళా రేషన్ డీలర్
తూర్పుగోదావరి జిల్లాలో మహిళా రేషన్ డీలర్ హల్‌చల్ చేసింది. రాయవరం మండలం నడురబడ గ్రామంలో రేషన్ డిపో స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులపై దాడి చేసింది.

Woman Ration Dealer
female ration dealer attack : తూర్పుగోదావరి జిల్లాలో మహిళా రేషన్ డీలర్ హల్‌చల్ చేసింది. రాయవరం మండలం నడురబడ గ్రామంలో రేషన్ డిపో స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులపై దాడి చేసింది. మిర్తిపాటి జ్యోతి అనే రేషన్ డీలర్..ప్రభుత్వ ఉద్యోగులతో వాదనకు దిగి వారి కళ్లలోకి కారం చల్లింది. సచివాలయ మహిళా పోలీస్, ఉద్యోగుల కళ్లలో కారం కొట్టిడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఆర్డీవో సింధు, డీఎస్పీ బాలచంద్రారెడ్డి సమక్షంలో ఈ దాడి జరిగింది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై దాడి చేసిన రేషన్ డీలర్ జ్యోతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు రేషన్ బియ్యంలో ఒక్క గింజ అవసరం లేదంటూ ప్రభుత్వ ఉద్యోగులతో రేషన్ డీలర్ జ్యోతి వాదనకు దిగింది.
Kotia Villages : ఏపీలోనే ఉంటాం.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాల ప్రజలు
రాజకీయ నేతల మాట విని తప్పుచేసి..ఆ తప్పు తనపైకి గెంటేస్తా ఎలా అని ఎదురు తిరిగింది. ఆ సమయంలో ఆర్డీవో సింధు ఏం చెబుతున్నా వినిపించుకోలేదు. కళ్లలో కారం వేయొచ్చా అని ఓ ఉద్యోగి నిలదీసినా డీలర్ మిర్తిపాటి జ్యోతి మొండిగా వాదించింది.