యోగా డే స్పెషల్.. సితార పాప సింపుల్ ఆసనాలు

  • Published By: Subhan ,Published On : June 21, 2020 / 09:00 AM IST
యోగా డే స్పెషల్.. సితార పాప సింపుల్ ఆసనాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్‌ 21 సందర్భంగా ఆద్య, సితారలు యోగా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నారు. అంతేకాకుండా సులువైన యోగాసనాలు గురించి వివరిస్తూ ఓ వీడియోను A & S యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేశారు. సునాయసంగా వేసే యోగాసనాలతో పాటు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను చక్కగా వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.  

ఇక వీరి ప్రయత్నానికి, డెడికేషన్‌కు నెటిజన్లు, మహేశ్ అభిమానులు ఫిదా అవుతూ సూపర్బ్‌ అంటూ పొగిడేస్తున్నారు. మహేశ్‌బాబు ముద్దుల కూతురు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్య ఇద్దరూ A & S అనే యూట్యూబ్‌ ఛానల్‌ను కొద్ది నెలల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వేదికగా ఆటలు, విజ్ఞానం, వినోదానికి సంబంధించిన పలు వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. 

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదల తర్వాత మహేశ్, రష్మికలను ఇంటర్వ్యూచేసి ఆకట్టుకున్నారు. అభిమానులకు ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తూ పలు వీడియోలను పోస్ట్‌ చేస్తుండటంతో A & S యూట్యూబ్‌ ఛానల్‌కు ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.  

Read: సుశాంత్ మరణంపై సల్మాన్ ఖాన్ Tweet..ఏమన్నాడంటే