Road to Village: కొడుకు పెళ్లి కానుకగా రోడ్డు వేయించిన తండ్రి

తన కొడుకు పెళ్లి పేరుమీద తమ గ్రామస్తులకు రోడ్డు కష్టాలను తీర్చేశారు ఓ వ్యక్తి

Road to Village: కొడుకు పెళ్లి కానుకగా రోడ్డు వేయించిన తండ్రి

Road

Road to Village: ఎవరింట్లో అయినా పెళ్లంటే బంధువులను, స్నేహితులను పిలుచుకుంటారు. వచ్చే బంధువులు, శ్రేయోభిలాషుల కోసం వాహనాలను సమకూరుస్తారు. వసతి, విందు, వినోదాలు ఏర్పాటు చేస్తారు. కానీ ఓ పెళ్లి కూమారుడి తండ్రి ఇంతవరకు ఎవరూ చేయని పని చేశాడు..తన కొడుకు పెళ్లి పేరుమీద తమ గ్రామస్తులకు రోడ్డు కష్టాలను తీర్చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం మండలం కొత్త నరసాపురం గ్రామానికి చెందిన నిరీక్షణరావు అనే వ్యక్తి తన కొడుకు పెళ్లి సందర్భంగా గ్రామానికి రోడ్డు వేయించారు. పెళ్లికి వచ్చేవారు గుంతల రోడ్డులో ప్రమాదానికి గురవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో 4 లక్షల రూపాయల సొంత డబ్బును ఖర్చు పెట్టి గ్రామానికి రోడ్డు వేయించారు.

TRS MLC: ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా.. ప్రకటించనున్న టీఆర్ఎస్

నరసాపురం మెయిన్‌ రోడ్డు నుంచి కొత్త నరసాపురం వరకు కిలోమీటరు మేర రహదారి పూర్తిగా పాడైపోయింది. గత రెండేళ్లుగా ప్రయాణించడానికి వీలు లేకుండా రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. రోడ్డుమీద పెద్ద పెద్ద గోతులు పడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

దీంతో గ్రామానికి చెందిన చిందాడి నిరీక్షణరావు తన ఖర్చులతో రోడ్డు బాగుచేయించారు. రోడ్డు మరమ్మతులు చేయించాలని అధికారులు, నాయకులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోలేదని, తన కుమారుడి పెళ్లికి గుర్తుగా ఉంటుందని ఇది తమ గ్రామానికి పెళ్లి కానుక అని నిరీక్షణ రావు చెప్పారు.