Manda Krishna Madiga: డాక్టర్ అచ్చెన్న హత్యలో కిరాయి హంతకుల పాత్ర ఉంది: మందకృష్ణ మాదిగ

నిపుణులైన వైద్యులతో రీ పోస్టుమార్టం నిర్వహించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హత్యకు పరోక్షంగా సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. 12వ తేదీ కనిపించకుండాపోతే 14వ తేదీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు.

Manda Krishna Madiga: డాక్టర్ అచ్చెన్న హత్యలో కిరాయి హంతకుల పాత్ర ఉంది: మందకృష్ణ మాదిగ

Manda Krishna Madiga

Manda Krishna Madiga: ఆంధ్రప్రదేశ్ లోని కడపలో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చెన్న హత్య ఉదంతంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందించారు. హత్యలో కిరాయి హంతకుల పాత్ర ఉందని ఆరోపించారు. డాక్టర్ అచ్చెన్న హత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేలా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించాలని మందకృష్ణ మాదిగ అన్నారు. కడప జిల్లాలో ఆయన ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడారు. పోస్టుమార్టంపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు.

నిపుణులైన వైద్యులతో రీ పోస్టుమార్టం నిర్వహించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హత్యకు పరోక్షంగా సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. 12వ తేదీ కనిపించకుండాపోతే 14వ తేదీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. ఉద్యోగ నిబంధనలు ఉల్లంఘించి అచ్చెన్నను మానసికంగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. నిందితులను కాపాడేందుకు పై అధికారులు ప్రయత్నించారని అన్నారు. హత్యలో కిరాయి హంతకుల పాత్ర ఉందని చెప్పారు.

వేరే చోట హత్య చేసి గువ్వల చెరువు ఘాట్ లో పడేశారని మందకృష్ణ మాదిగ తెలిపారు. కడప జిల్లా పోలీసుల నిర్లక్ష్యం అచ్చెన్న హత్యకు దారితీసిందని అన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించని వన్ టౌన్ సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కొందరు అనుమానితుల పేర్లను ఎఫ్ఐఆర్ లో ఎస్సై నమోదు చేయలేదని అన్నారు.

అనుమానితులపై ఫిర్యాదు చేసినా పోలీసులు విచారించలేదని మందకృష్ణ మాదిగ చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో దళిత ఉద్యోగులకు రక్షణ లేదని అన్నారు. దళితుల ప్రాణాలకు విలువ లేదా? అని నిలదీశారు. దళితుల ఫిర్యాదుకు పోలీసులు స్పందించరని అన్నారు. అచ్చెన్న కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Black Protest: కాంగ్రెస్ పార్టీ నిరసనలో సడెన్ ఎంట్రీ ఇచ్చిన తృణమూల్ కాంగ్రెస్