Kadapa floods : కడపలో వరద బీభత్సం..వారంతా ఎక్కడున్నారు ? బతికి ఉన్నారా..లేరా

వరద శిథిలాల మధ్య  గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు కడప జిల్లాలో ఏ కుటుంబాన్ని కదిలించినా.. కన్నీటి గాధే..

Kadapa floods : కడపలో వరద బీభత్సం..వారంతా ఎక్కడున్నారు ? బతికి ఉన్నారా..లేరా

Missing

Kadapa Floods : కడప జిల్లాలో వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. చాలా మంది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. తమ వారిని పోగొట్టుకున్న వారు కొందరైతే..ఆస్తులు పోగొట్టుకున్న వారు మరికొందరు. ఇలా ఎక్కడ చూసినా..విషాదఛాయలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వరదల కారణంగా..చాలా మంది తప్పిపోయారు. వారి ఆచూకీ తెలియక కన్నీరుమున్నీరవుతున్నారు. వరద శిథిలాల మధ్య  గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు కడప జిల్లాలో ఏ కుటుంబాన్ని కదిలించినా.. కన్నీటి గాధే..  జిల్లాలో 39 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 26 మృతదేహాలను గుర్తించి.. బాధిత కుంటుంబాలకు అప్పగించారు. గల్లంతైన మరో 13 మంది కోసం నాలుగు ప్రత్యేక పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి.

Read More : Tomato: వంటకాల్లో టమోటాలకు ప్రత్నామ్నాయంగా ఇవి వాడండీ..టేస్టుకు టేస్టు..ఆరోగ్యం కూడా

2021, నవంబర్ 25వ తేదీ గురువారం మరికొన్ని మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. తమ వారు ఎమయ్యాలో తెలియక బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నాయి. బతికి ఉన్నారా.. లేరా..  జీవించి ఉంటే ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు..  ఎప్పుడు తిరిగివస్తారు ? లేకపోతే ఏమయ్యారోనని తలచుకుంటూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. తమవారి ఫోటోలు చూసుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. గల్లంతైన వారి కుటుంబాలు విషాదంలో ఉన్నాయి. భారీ వరదల ధాటికి అయిన వారు గల్లంతవడంతో .. వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు కళ్లు కాయలుకాసేలా  ఎదురుచూస్తున్నారు. ఎక్కడోచోట బతికే ఉన్నారన్న ఆశతో బతుకుతున్నారు. చెయ్యేరు ఉప్పొంగడంతో దాదాపు 40  మంది గల్లంతయ్యారు. వీరిలో ఇప్పటివరకూ 24 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇప్పటికే 23 మృతదేహాలను వారి  బంధువులకు అప్పగించారు. అయితే గుర్తుతెలియని మృతదేహం ఇంకా మార్చురీలోనే ఉంది. అటు జిల్లా మొత్తం మీద 39 మిస్సింగ్‌ కేసులు నమోదైతే.. ఒక్క రాజంపేట పోలీస్‌స్టేషన్‌లోనే 15 మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే గుండ్లూరు చెందిన ఆయేషా భర్త రషీద్ కేసులో…ఇప్పటికీ మిస్సింగ్ కేసుగా నమోదు కాలేదు.

Read More : Noida International Airport : ఆసియాలో అతిపెద్ద ఎయిర్ పోర్ట్ కి మోదీ శుంకుస్థాపన

మరోవైపు రామాపురం చెక్ పోస్టు వద్ద వరద నీటిలో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు ఘటనలో .. ఇప్పటికీ శివ ఆచూకీ  లభించలేదు. బస్సు ఘటనలో చిక్కుకుని చివరిసారిగా తన భార్యకు వాట్సాప్ కాల్ చేశాడు శివ. అయితే పది నిమిషాల  తర్వాత నుంచి శివ కనిపించకుండా పోయాడు. ఏడు రోజులుగా దాదాపు 30 మంది.. శివ ఆచూకీ కోసం అన్వేషిస్తూనే  ఉన్నారు. గల్లంతైన శివ బ్యాగును తాళ్ళపాక ఇసుకపల్లి మధ్యలోని మామిడి చెట్లకు తగులుకుని ఉండగా గుర్తించారు. బంధువులు. ఇక మందపల్లిలో పూజారి కుటుంబం నుంచి తొమ్మిది మంది గల్లంతవ్వగా.. ఇప్పటి వరకూ నలుగురి  మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 5గురి మృతదేహాలు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు.