Noida International Airport : ఆసియాలో అతిపెద్ద ఎయిర్ పోర్ట్ కి మోదీ శుంకుస్థాపన

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జెవార్​లో నిర్మించ తలపెట్టిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో

Noida International Airport : ఆసియాలో అతిపెద్ద ఎయిర్ పోర్ట్ కి మోదీ శుంకుస్థాపన

Modi

Noida International Airport :  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జెవార్​లో నిర్మించ తలపెట్టిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తర్​ప్రదేశ్ ​ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

జెవార్​ విమానాశ్రయం నిర్మాణంతో ఏడు దశాబ్దాల తర్వాత యూపీ కలలు సాకారమవుతున్నాయని మోదీ అన్నారు. జెవార్‌లో నిర్మించే నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తర భారతదేశానికి లాజిస్టిక్స్ గేట్‌వేగా మారుతుందన్నారు. ఈ విమానాశ్రయంతో పశ్చిమ ఉత్తర్​ప్రదేశ్​లోని వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. మెరుగైన రోడ్లు, మెరుగైన రైలు నెట్‌వర్క్, మెరుగైన విమానాశ్రయాలు కేవలం ప్రాజెక్టులు మాత్రమే కాదని.. అవి మొత్తం ప్రాంతం రూపురేఖలనే మార్చేస్తాయని మోదీ తెలిపారు.

గత ప్రభుత్వాల హయాంలో చీకట్లో మగ్గిన ఉత్తరప్రదేశ్ ఇప్పుడు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగానూ తనదైన ముద్ర వేసిందని ప్రధాని అన్నారు. బహుళజాతి కంపెనీల పెట్టుబడులకు యూపీ కేంద్ర బిందువుగా మారిందన్నారు. యూపీకి ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలను కలిగి ఉంటుందన్నారు. మౌలిక సదుపాయాలు అనేవి తమకు రాజకీయాలు కాదని, జాతీయ విధానంలో భాగమని మోదీ అన్నారు.  ప్రాజెక్టులు నిలిచిపోకుండా, సకాలంలో పూర్తి చేస్తామని తాము భరోసా ఇస్తున్నామన్నారు.

ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా నిలవనున్నఈ ఎయిర్​పోర్ట్​..ఢిల్లీ-ఎన్​సీఆర్​ పరిధిలోని రెండవ అంతర్జాతీయ విమానాశ్రయం. 2024 సెప్టెంబర్​ నాటికి ఈ విమానాశ్రయం మొదటి ఫేజ్ పూర్తవనుందని,అదే ఏడాది ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తెలిపారు. విమానాశ్రయం 1300 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉందని.. ఇది అందుబాటులోకి వచ్చిన మొదటి సంవత్సరానికి 1.2 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అన్నారు.

ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే, తూర్పు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా, మీరట్ మరియు సమీపంలోని పశ్చిమ UP జిల్లాల నివాసితులకు ప్రయాణాన్ని సులభతరం కానుంది. ఈ విమానాశ్రయం హర్యానాలోని బల్లభ్‌గఢ్ సమీపంలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేకి అనుసంధానం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఢిల్లీ విమానాశ్రయానికి దూరంగా నివసించే హర్యానా మొత్తం జనాభాకు నేరుగా విమాన కనెక్టివిటీ లభిస్తుంది.

ALSO READ Kim Jong Un : ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసినవారికి దారుణ శిక్ష విధించిన కిమ్ జోంగ్