Tomato: వంటకాల్లో టమోటాలకు ప్రత్నామ్నాయంగా ఇవి వాడండీ..టేస్టుకు టేస్టు..ఆరోగ్యం కూడా

టమాటా ధర మండిపోతోంది. కొనేలా లేదు. కాబట్టి..కూరలో టమోటాలకు ప్రత్నామ్నాయంగా పలు రకాల కూరగాయలు వాడుకోవచ్చు. వీటివల్ల ..టేస్టుకు టేస్టు..ఆరోగ్యం కూడా అంటున్నారు నిపుణులు.

Tomato: వంటకాల్లో టమోటాలకు ప్రత్నామ్నాయంగా ఇవి వాడండీ..టేస్టుకు టేస్టు..ఆరోగ్యం కూడా

Tomato (1)

Tomato: టమాటా కిలో Rs.100 ఎప్పుడో దాటేసింది. ఎర్రగా ఉండే టమాట ధరల మంటలు మండిస్తోంది. కూర, రసం,సాంబార్, పచ్చడి, టమాసా రైస్, బిర్యానీ ఇలా ఏది చేయాలన్నా టమాట ఉండాల్సిందే. అటువంటిది వంటింట్లో టమాటా జాడే లేదు. ఏది వండినా టమాటా ఉండాల్సిందే. లేదంటే టేస్టు ఉండదు. కానీ మరి టమాట అందనంత ధరలో ఉంది. ఇప్పుడెలా?టేస్టు లేని టమాటా కూర తినాల్సిందేనా? అంటే అదేం కాదు ప్రత్యామ్నాయం ఉంది.కూరల్లో రుచిని.. అదేవిధంగా టమాటాతో సమానమైన పోషకాల్ని అందించే కొన్ని ప్రత్యామ్నాయాలు ఉండనే ఉన్నాయి. టమాటా లేదని ఎందుకు బెంగ మేముండగా అంటున్నాయి కొన్ని కూరగాయలు. మరి అవి ఏంటో వాటి టేస్ట్ ఏంటో.. టమాటాతో సమానమైన పోషకాల్ని అందించే వాటి గురించి తెలిసేసుకుందాం..

Tomato

క్యాప్సికమ్‌
క్యాప్సికమ్ చూడటానికి భలే ఉంటుంది. రకరకాల రంగుల్లో ఎట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అంతేకాదు దీంట్లో అనేక న్యూట్రీషియన్స్, విటమిన్, ఎ, సి, ఫైబర్, కెరోటినాయిడ్స్, అధికంగా ఉన్నాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి చాలా ఉపయోపడతాయి. క్యాప్సికమ్‌ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని పోషకాహార నిపుణుడు డాక్టర్ శైలి తోమర్ తెలిపారు. టొమాటోల్లో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది క్యాప్సికమ్‌లో కూడా ఉంటుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే టమాటాలో కంటే రెడ్ క్యాప్సికమ్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో..టమాటా లేదని ఎందుకు బెంగ నేను ఉండగా అంటోంది ‘రెడ్ క్యాప్సికమ్‌’.

Tomato Amla

ఆరోగ్యాల సిరి..ఉసిరి..
ఉసిరిని ఆరోగ్యాలనిచ్చే సిరి అంటారు. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సితోపాటు విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం లోపంతో బాధపడేవారికి ఐరనన్ సమస్యను తగ్గిస్తుంది. ఉసిరిలో సహజ పులుపు కూడా ఉంటుంది. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. టొమాటో గుజ్జులా ఉంటుంది. దీని కారణంగా తక్కువ టమోటాలలో మంచి పురీ తయారవుతుంది. మీకు జామకాయ, టమోటా వంటి ప్యూరీ కావాలంటే, ఉసిరికాయను ఉడకబెట్టి, అందులో బెల్లం కలపండి. ఇది పుల్లని తీపి, గుజ్జు ప్యూరీని చేస్తుంది. మరి ఇంకెందుకు లేట్..టమాట లేకపోతేనే నేనున్నాను..ఆరోగ్యాలను..టేస్టు ను ఇవ్వటానికి అంటోంది ’ఉసిరి’.

Tomato (2)

పండిన గుమ్మడిపండు ఆరోగ్యాల మెండు..
టమోటాల స్థానంలో పండిన గుమ్మడికాయ ప్యూరీని వాడుకోవచ్చు. బంగారు రంగులో ఉండే గుమ్మడి పండులో ఔషధాల గని అని చెప్పాల్సిదే.గుమ్మడి పండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. గుమ్మడికాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.ఇది శరీర బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దాని ప్యూరీకి వెనిగర్ కూడా జోడించవచ్చు. ఇది టమోటా లాంటి రుచిని ఇస్తుంది. ఇందులో విటమిన్ ఇ,సి కూడా ఉన్నాయి. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది.

Chintakaya

చింతపండు..లేదా చింతకాయలు
ఇక టమాటాకు ప్రత్యామ్నాయంగా చింతకాలయలు..లేదా చింతపండు. వాడుకోవచ్చు. చింతపండు గుజ్జుతో పులిహోర ఎంత టేస్టో చెప్పనక్కరలేదు. అలాగే కూరల్లో..పులుసు కూరలు అంటాం వీటిని. అలాగే సాంబార్, రసం వంటివాటిలో వాడతాం. చేపల కూరలో టమాట కంటే చింతపండే రుచి. చింతపండు వాడుకునే ముందు 15–20 నిమిషాలు చింతపండును నానబెడితే చాలు గుజ్జు తీసుకుని వాడేసుకోవచ్చు.