Audio Tape Issue : అది ఫేక్ ఆడియో, కొందరు కుట్ర చేశారు – మంత్రి అవంతి

ఆడియో టేపుల వ్యవహారంపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. తన రాజకీయ ఎదుగుదలను తట్టుకోని కొందరు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు.

Audio Tape Issue : అది ఫేక్ ఆడియో, కొందరు కుట్ర చేశారు – మంత్రి అవంతి

Avanthi

Updated On : August 20, 2021 / 8:59 AM IST

Minister Avanthi srinivas : ఆడియో టేపుల వ్యవహారంపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. తన రాజకీయ ఎదుగుదలను తట్టుకోని కొందరు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. తనను బాధ పెట్టాలని సోషల్ మీడియాలో అలా చేశారని మండిపడ్డారు. మహిళకు ఫోన్ చేశానన్న అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఎంక్వైరీ చేయాలని పోలీసుల్ని కోరినట్లు ఆయన తెలిపారు. చౌకబారు ఆరోపణలతో తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, దేవుడి పట్ల తనకు నమ్మకం ఉందన్నారు. అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటానని మంత్రి అవంతి పేర్కొన్నారు.

Read More : తగ్గిన క్రూడాయిల్ ధరలు..పెట్రోల్ రేట్లు తగ్గుతాయా..!

విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి అవంతి మీడియాతో మాట్లాడారు. సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి..మంచితనంతో అంచెలంచెలుగా ఎమ్మెల్యే నుంచి మంత్రి స్థాయి వరకు ఎదిగానన్నారు. అయితే..తనకు సంబంధించినట్లుగా ఆడియే టేపు విడుదల చేశారని, తన రాజకీయ ఎదుగుదల, వైఎస్సార్ సీపీ ప్రగతిని చూసి ఓర్వలేక జరిగిన కుట్రగా భావిస్తున్నట్లు తెలిపారు. తనకు శత్రువులు ఎవరూ లేరని, తాను మహిళతో మాట్లాడిన విషయం వాస్తవం కాదని మరోసారి ఆయన స్పష్టం చేశారు.

Read More : Shravana Purnima And Raksha Bandhan : శ్రావణ పూర్ణిమ-రక్షా బంధనం

తాను తప్పుడు పనులు చేయనని, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతానని చెప్పారు. జిల్లాలో ఏకైక మంత్రిగా తాను చేసే మంచి పనులు, పార్టీ అభివృద్ధి చూడలేకనే సోషల్ మీడియాలో ఫేక్ ఆడియాతో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇందులో ఎవరున్నా వదిలేది లేదని మంత్రి అవంతి వెల్లడించారు.