Minister Balineni : చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య చిచ్చు పెట్టాలనే ఆలోచన జగన్‌కు లేదు-మంత్రి బాలినేని

చిరంజీవిని వైసీపీలోకి తీసుకొచ్చి.. అన్నదమ్ముల (చిరంజీవి- పవన్ కళ్యాణ్) మధ్య చిచ్చు పెట్టే ఆలోచన జగన్‌కి లేదని మంత్రి బాలినేని తేల్చి చెప్పారు. అసలు జగన్ ది అటువంటి క్యారెక్టర్..

Minister Balineni : చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య చిచ్చు పెట్టాలనే ఆలోచన జగన్‌కు లేదు-మంత్రి బాలినేని

Minister Balineni Srinivas Reddy

Minister Balineni : సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే వెళ్లి సీఎం జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. త్వరలోనే సినీ పరిశ్రమలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని జగన్ తో భేటీ తర్వాత చిరంజీవి అన్న విషయం విదితమే. ఇంతవరకు ఓకే.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

Ghosts Exist : అవును.. దెయ్యాలున్నాయి.. ఐఐటీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

జగన్ తో భేటీ తర్వాత.. చిరంజీవికి రాజ్యసభ సీటు ఖాయమైందనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి. కాపులను తమవైపు తిప్పుకుని.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు, బీజేపీకి చెక్ పెట్టేందుకు.. సీఎం జగన్.. చిరంజీవికి రాజ్యసభ టికెట్ ఆఫర్ చేశారనే విశ్లేషణలు వినిపించాయి. ఆ తర్వాత స్వయంగా చిరంజీవి స్పందించారు. రాజ్యసభ సీటు ఆఫర్ వార్తలను ఖండించారు. అసలు.. రాజకీయాలకు తాను పూర్తి దూరంగా ఉన్నానని గుర్తు చేశారు. పాలిటిక్స్ కు దూరంగా ఉన్న తనకు ఎవరూ ఆఫర్లు ఇవ్వరని చిరు చెప్పారు. తాను ఆఫర్లకు లోబడే వ్యక్తిని కానని తేల్చి చెప్పారు.

సీఎం జగన్‌, చిరంజీవి భేటీ అనంతరం చిరుకు రాజ్యసభ సీటు ఇస్తున్నారంటూ వచ్చిన రూమర్స్‌పై తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్ల ఇబ్బందులు గురించి చెప్పడానికి మాత్రమే సీఎం జగన్‌ను చిరంజీవి కలిశారని మంత్రి స్పష్టం చేశారు. అయితే, కొంతమంది దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలా ఎందుకు చేస్తారో అర్ధం కావడం లేదని వాపోయారు. సినిమా వాళ్ల తరపున వచ్చి చిరంజీవి కలిస్తే ఏదో ఒకటి పులమాలని చూస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. చిరంజీవిని వైసీపీలోకి తీసుకొచ్చి.. అన్నదమ్ముల (చిరంజీవి- పవన్ కళ్యాణ్) మధ్య చిచ్చు పెట్టే ఆలోచన జగన్‌కి లేదని మంత్రి బాలినేని తేల్చిచెప్పారు. అసలు జగన్ ది అటువంటి క్యారెక్టర్ కాదన్నారు. పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ ఒంటరిగానే పోటీ చేస్తున్నారని మంత్రి తెలిపారు.

Block Unknown Numbers : ఈ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గుర్తుతెలియని నెంబర్లను ఇలా బ్లాక్ చేయండి..!

చిచ్చు పెట్టే క్యారెక్టర్, అటువంటి చరిత్ర చంద్రబాబుకు ఉందని మంత్రి ఆరోపించారు. దళితులు, కాపుల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతుంటారని, రెచ్చగొట్టాలని చూస్తారని మంత్రి బాలినేని శ్రీనివాస్ మండిపడ్డారు.

ఒంటరిగా జగన్ ను కలవాల్సిన అవసరం ఏమిటి?
చిరంజీవికి రాజ్యసభ సీటు ఊహాగానాలపై సీపీఐ నేత నారాయణ సైతం స్పందించారు. ఒంటరిగా ముఖ్యమంత్రి జగన్ ని కలవడం చిరంజీవి చేసిన పొరపాటు అని ఆయన అన్నారు. ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద వెళ్లి సీఎం జగన్ ను చిరంజీవి ఒంటరిగా కలవాల్సిన అవసరం ఏమిటి? ఆయన ప్రశ్నించారు. సమస్య సినీ పరిశ్రమదే తప్ప, వ్యక్తిగతంగా చిరంజీవిది కాదని నారాయణ అన్నారు. వారిద్దరి మధ్య రాజ్యసభ సీటు అంశం ప్రస్తావనకు వచ్చిందో లేదో కానీ.. వన్ టూ వన్ భేటీ ఊహాగానాలకు అవకాశమిచ్చిందన్నారు. ఇది సినీ పరిశ్రమ సమస్య కాబట్టి ఆయా అసోసియేషన్లను వెంటబెట్టుకుని చిరంజీవి సీఎంను కలిసి ఉండాల్సిందని నారాయణ అభిప్రాయపడ్డారు.