Somu Veerraju : ఎన్టీఆర్ పేరు తొలగింపు వివాదం.. జగన్ ప్రభుత్వానికి బీజేపీ చీఫ్ వార్నింగ్

ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని, తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి ఎన్టీఆర్ పరిచయం చేశారని.. అలాంటి మహనీయుల పేర్లు పెట్టడం మాని.. ఉన్న దాన్ని కూడా తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉద్యమానికి బీజేపీ సిద్ధమవుతుందని వార్నింగ్ ఇచ్చారు సోము వీర్రాజు.

Somu Veerraju : ఎన్టీఆర్ పేరు తొలగింపు వివాదం.. జగన్ ప్రభుత్వానికి బీజేపీ చీఫ్ వార్నింగ్

Somu Veerraju : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌) పేరు మార్పుపై రచ్చ రచ్చ జరుగుతోంది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుని తొలగించి.. వైఎస్సార్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా పేరు పెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ భగ్గుమంది. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి.

ఎన్టీఆర్ పేరు తొలగింపు వ్యవహారంపై అధికార పార్టీ వైపీపీలోనూ దుమారం రేగింది. అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే పేరు మార్పు బిల్లుని వెనక్కి తీసుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం తన అభిప్రాయాన్ని తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ను వంశీ కోరారు. వర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని జగన్ కు విన్నవించారు.

ఇదే వ్యవహారంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును తీవ్రంగా వ్యతిరేకించారు బీజేపీ ఏపీ చీఫ్ సోమువీర్రాజు. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని, తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి ఎన్టీఆర్ పరిచయం చేశారని.. అలాంటి మహనీయుల పేర్లు పెట్టడం మాని.. ఉన్న దాన్ని కూడా తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉద్యమానికి బీజేపీ సిద్ధమవుతుందని వార్నింగ్ ఇచ్చారు సోము వీర్రాజు.

రాజ‌కీయ దురుద్దేశాల‌తోనే వైసీపీ స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని సోమువీర్రాజు విమ‌ర్శించారు. రాజకీయాలకు అతీతంగా నందమూరి తారక రామారావును అభిమానించే వ్యక్తులు రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఏమి సాధిద్దామని ఇలాంటి నిరంకుశమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని సీఎం జ‌గ‌న్ ని ప్ర‌శ్నించారు. వ్యక్తుల పేరును మార్చగలరు.. కానీ, చరిత్రను కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు సోమువీర్రాజు.

”ఎన్టీఆర్ వైద్య విద్యా పరిషత్ పేరును మార్చి.. జగన్.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని.. బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని, తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన పెద్దల పేర్లు పెట్టడం మాని.. పెట్టిన దాన్ని తొలగించడం దారుణం. జగన్ ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో దీనిపై ఉద్యమం చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది” అని జగన్ సర్కార్ ను హెచ్చరించారు సోము వీర్రాజు.

 

ఎన్టీఆర్ పేరు తొలగింపుపై సోమువీర్రాజు వార్నింగ్..