Paritala Sunitha : చంద్రబాబు ఒక్క మాట చెబితే.. వైఎస్ఆర్ గూండాలు రోడ్లపై తిరగలేరు : పరిటాల సునీత

జడ్ ప్లస్ క్యాటగిరి ఉన్న వ్యక్తిపై రాళ్ల దాడి చేశారని తెలిపారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమే కాకుండా.. తమ కార్యకర్తలను కొట్టారని ఆరోపించారు.

Paritala Sunitha : చంద్రబాబు ఒక్క మాట చెబితే.. వైఎస్ఆర్ గూండాలు రోడ్లపై తిరగలేరు : పరిటాల సునీత

Paritala Sunitha

Updated On : August 17, 2023 / 10:33 AM IST

Paritala Sunitha Warning YCP Activists : వైసీపీ కార్యకర్తలకు మాజీ మంత్రి పరిటాల సునీత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు(Chandrababu) ఒక్క మాట చెబితే వైఎస్ఆర్ గూండాలు(YSR gangsters) రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు. తమ ప్రాణాలు పోయినా సరే.. చంద్రబాబును రక్షించుకుంటామని చెప్పారు. చంద్రబాబు కనుసైగ చేస్తే చాలు.. వారి పని తాము చూసుకుంటామని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె అనంతపురంలో(Ananthapuram) మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు పర్యటనలో పోలీసులే రాళ్ల దాడి చేశారని పేర్కొన్నారు. తాము నిరసన చేస్తామంటే.. అరెస్టులు చేయిస్తున్నారని వాపోయారు. జడ్ ప్లస్ క్యాటగిరి ఉన్న వ్యక్తిపై రాళ్ల దాడి చేశారని తెలిపారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమే కాకుండా.. తమ కార్యకర్తలను కొట్టారని ఆరోపించారు.

Minister Peddireddy : చంద్రబాబు రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలను పోలీసులపై దాడికి పాల్పడేలా చేశారు : మంత్రి పెద్దిరెడ్డి

మంత్రి పెద్దిరెడ్డి అంటే ఆయన ఇంటికి పెద్ద కావచ్చు.. తమకు కాదన్నారు. ‘నువ్వు చంద్రబాబును అడ్డుకోవాలనుకుంటే.. మీరే స్వయంగా రోడ్డు మీదకు రండి’ అని పెద్దిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎప్పుడూ కాలం ఒ‍కేలా ఉండదన్నారు. సమయం వచ్చినప్పుడు మీ కథ చెబుతామని హెచ్చరించారు.