Pawan Kalyan : అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మాణంపై సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ విమర్శలు

ప్రమాద ఘటన జరిగిన వెంటనే ఏపీ సీఎం అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నామని, ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారని తెలిపారు.

Pawan Kalyan : అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మాణంపై సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ విమర్శలు

Pawan Kalyan criticized Jagan

Pawan Kalyan criticized CM Jagan : ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అన్నమయ్య డ్యామ్ ను తిరిగి పూర్తిస్థాయిలో పునర్నిర్మాణం చేసి ఒక ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని సీఎం ఘనంగా ప్రకటించారని గుర్తు చేశారు.

అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన దుర్ఘటన జరిగి నేటితో 18 నెలలవుతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి దేవుడికి ఎరుకని, నేటికి కూడా వీసమెత్తు పనులు చేయలేదని విమర్శించారు. ఈ 18 నెలలలో సాధించిందేమిటంటే సీఎం అస్మదీయుడు పొంగులేటికి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని 660 కోట్ల రూపాయలకు అప్పచెప్పారని ఆరోపించారు.

EC Shock Janasena : జనసేన పార్టీకి ఈసీ భారీ షాక్.. ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాసు

ప్రమాద ఘటన జరిగిన వెంటనే ఏపీ సీఎం అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నామని, ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారని తెలిపారు. మరీ ఆ కమిటీ ఏమైందోనని, వారు రాష్ట్రంలోని మిగతా డ్యాములకు ఇలాంటి దుర్ఘటనలు జరుగకుండా ఏ సూచనలు చెప్పారో తెలియదన్నారు.

ఏపీ సీఎం ఏమీ చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక అన్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి శకావత్ రాజ్యసభలో మాట్లాడుతూ ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అని స్పష్టంగా చెప్పారు. ఈ ఘటనపై అంతర్జాతీయంగా అధ్యయనం జరిగి గనుక దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుందని వాపోయారు.