Cat fish : అక్రమంగా క్యాట్ ఫిష్ ల పెంపకం..దాణాగా కోళ్ల వ్యర్థాలు.. బయటపెట్టిన 10టీవీ

క్యాట్ ఫిష్ ల పెంపకంపై నిషేధం ఉంది. కానీ చాటుమాటుగా క్యాట్ ఫిష్ ల పెంపకాలు జరుగుతునే ఉన్నాయి. ఈక్రమంలో ఏపీలోని ప్రకాశంజిల్లాలో రహస్యంగా క్యాట్ ఫిష్ ల పెంపకాలను 10టీవీ బయటపెట్టింది. చీమకుర్తి మండలం ఊబచెత్తపల్లి గ్రామంలో కొంతమంది రహస్యంగా క్యాట్ ఫిష్ లను పెంచుతుండటాన్ని 10టీవీ బయటపెట్టింది.

Cat fish : అక్రమంగా క్యాట్ ఫిష్ ల పెంపకం..దాణాగా కోళ్ల వ్యర్థాలు.. బయటపెట్టిన 10టీవీ

Catfish In Ap

Updated On : June 18, 2021 / 10:49 AM IST

Cat fish breeding as a secret : క్యాట్ ఫిష్ ల పెంపకంపై నిషేధం ఉంది. కానీ చాటుమాటుగా క్యాట్ ఫిష్ ల పెంపకాలు జరుగుతునే ఉన్నాయి. ఈక్రమంలో ఏపీలోని ప్రకాశంజిల్లాలో రహస్యంగా క్యాట్ ఫిష్ ల పెంపకాలు జరగుతున్నాయి. దీన్ని 10టీవీ బైటపెట్టింది. చీమకుర్తి మండలం ఊబచెత్తపల్లి గ్రామంలో కొంతమంది రహస్యంగా క్యాట్ ఫిష్ లను పెంచుతుండటాన్ని 10టీవీ బయటపెట్టింది.

సాధారణంగా చేపలు తింటే మంచిదని నిపుణులు చెబుతారు. చేపలు నీటిలో ఉండే నాటు..చిన్న చిన్న చేపల్ని పెద్ద చేపలు తిని పెరుగుతాయి. కానీ క్యాట్ ఫిష్ లు మాత్రం అలా కాదు కుళ్లిపోయిన జీవరాశుల కళేబరాలు..కుళ్లిన వ్యర్థాలు తిని భారీగా పెరిగిపోతాయి. అంతేకాదు క్యాట్ ఫిష్ లు పెంచే చెరువుల్లో ప్రమాదవశాత్తు ఏమైనా జంతువులు గానీ దిగితే వాటిని కూడా క్యాట్ ఫిష్ లు స్వాహా చేసేస్తాయి. దొరికితే మనుషుల్ని కూడా చంపి తినేస్తాయి. అంటే క్యాట్ ఫిష్ లు ఓ రకమైన రాకాసి చేపలు అని చెప్పుకోవచ్చు. ఈ క్యాట్ ఫిష్ లు మంచినీటిలోనే కాదు మురుగునీరు..ఆఖరికి డ్రైనేజీ నీటిలో కూడా పెరుగుతాయి.

ఈ క్యాట్ ఫిష్ ల పెంపకానికి పెద్దగా ఖర్చు ఉండదు. పైగా వీటికి ఆహారంగా చనిపోయిన కోళ్లు, కుళ్లిపోయిన వ్యర్థాలు వేసి పెంచుతారు. ఖర్చు తక్కువ..అతి త్వరగానే పెరిగిపోయే ఈ చేపల పెంపకానికి పెద్దగా కష్టపడనక్కరలేదు. పైగా భారీగా పెరుగుతాయి. వీటిని తింటే ఆరోగ్యానికి హాని కూడా. దీంతో ఈ క్యాట్ ఫిష్ ల పెంపకాలపై నిషేధం ఉంది. కానీ పలు ప్రాంతాల్లో రహస్యంగా క్యాట్ ఫిష్ ల పెంపకాలు జరగుతున్నాయి. భారత్ లో క్యాట్ ఫిష్ ల పెంపకాలతో పాటు అమ్మటాన్ని కూడా నిషేధించారు.

కానీ చీమకుర్తి మండలం ఊబచెత్తపల్లి గ్రామంలో కొంతమంది రహస్యంగా క్యాట్ ఫిష్ లను పెంచుతుండటాన్ని 10టీవీ బయటపెట్టింది. కాగా నిషేధం ఉండీ అవి తింటే ఆరోగ్యానికి హానికరంగా ఉండే ఈ చేపల్ని ఎవరు తింటారు? ఎందుకు కొంటారు? అనే అనుమానం రావచ్చు. అక్కడే ఉంది ఈ క్యాట్ ఫిష్ లు అమ్మే వ్యాపారుల కిటుకు..ఈ క్యాట్ ఫిష్ ‘ ఎంతో డిమాండ్ ఉండే కొరమీను’ చేపలా కనిపిస్తుంది. కొరమీనుకు..క్యాట్ ఫిష్ కు తేడా తెలియని వారు దాన్నే కొరమీను అనుకుని కొనేస్తుంటారు. పైగా కొరమీను కిలో రూ.400లు ఉంటే క్యాట్ ఫిష్ మాత్రం మహా అయితే కిలో రూ.150 ఉంటుంది.

కొరమీనులాగా క్యాట్ ఫిష్ నల్లగా జిగురుగా ఉంటుంది. కానీ క్యాట్ పిస్ కు మీసాలుంటాయి. కొర్రమీనుకు మీసాలు ఉండవ్. దీంతో చేపల వ్యాపారులు తెలివి ఉఫయోగించి..క్యాట్ ఫిష్ కు ఉండే మీసాలు కట్ చేసి అమ్మేస్తుంటారు. కొర్రమీనుకు..క్యాట్ ఫిష్ కు తేడాలు తెలియనివారు దాన్నే కొరమీను అనుకుని కొనేస్తుంటారు. ఇటువంటి మోసాలతో నిషేధం ఉన్న క్యాష్ ఫిష్ ల దందా కొనసాగుతోంది. అటు రహస్య పెంపకాలు ఇటు మోసాల అమ్మకాలతో క్యాట్ ఫిష్ ల దందా కొనసాగుతూనే ఉంది. అలా అక్రమ పెంపకాలను..మోసాల అమ్మకాలు కొనసాగుతునే ఉన్నాయి. ఈక్రమంలో ఏపీలోని కొల్లేరు పరిసర ప్రాంతాల్లో క్యాట్ పఫిష్ ల అక్రమ పెంపకాలు జరుగుతుండేవి. కానీ అక్కడ నిఘా పెరగటంతో కేటుగాళ్లు రూటు మార్చి ప్రకాశం జిల్లాలో వీటి పెంపకాలు చేస్తున్నారు. పొలాల మధ్యలో ఉండే చిన్న చిన్న చెరువుల్లో క్యాట్ ఫిష్ ల పెంపకాలను చేస్తుండటంతో అక్రమ పెంపకాలను 10టీవీ బయటపెట్టింది.