Pregnant Lady: భర్తతో విసిగిపోయి 65 కిమీలు కాలి నడకన బయలుదేరిన నిండు గర్భిణీ: చివరకు రోడ్డుపై ప్రసవం

భర్త తీరుతో విసిగిపోయి, తన దారి తానే వెతుక్కుంటూ వెళ్లిన ఒక నిండు గర్భిణీ, 65 కిలో మీటర్లు కాలినడకన బయలుదేరి..చివరకు రోడ్డుపై ప్రసవించింది.

Pregnant Lady: భర్తతో విసిగిపోయి 65 కిమీలు కాలి నడకన బయలుదేరిన నిండు గర్భిణీ: చివరకు రోడ్డుపై ప్రసవం

Pregnanat

Pregnant Lady: భర్త తీరుతో విసిగిపోయి, తన దారి తానే వెతుక్కుంటూ వెళ్లిన ఒక నిండు గర్భిణీ, 65 కిలో మీటర్లు కాలినడకన బయలుదేరి..చివరకు రోడ్డుపై ప్రసవించింది. నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్షిణి అనే మహిళ భర్తతో కలిసి తిరుపతిలో నివసిస్తుంటుంది. భర్త ప్రతిరోజు గొడవ పెట్టుకుంటున్నాడని, అతని తీరుతో విసిగిపోయి తిరుపతి నుంచి ఒంటరిగా బయలుదేరింది(సుమారు మే 12న). నిండు గర్భిణీ అయిన వర్షిణి, ఎక్కడికి వెళ్లాలో తెలియక కాలినడకన ఒంటరిగా నడుచుకుంటూనే..వెళ్ళిపోసాగింది. అలా అక్కడక్కడా మార్గమధ్యలో ఆగి ఆగి 65 కిలోమీటర్లు నడుచుకుంటూ చివరకు నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చేరుకుంది వర్షిణి. చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. అయినవారెవరు ఇక్కడ లేరు.

Other Stories: Maharashtra : పోలీసు పరీక్షలో ఆమెగా పాస్,మెడికల్ టెస్ట్‌లో అతడుగా ఫెయిల్

శుక్రవారం సాయంత్రానికి నాయుడుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దకు చేరుకున్న వర్షిణికి పురిటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. దారిన పోతున్నవారిని సాయం అడిగినా వర్షిణి బాధ పట్టించుకున్న వారు ఒక్కరు లేరు. చివరకు ఒక యువకుడు వర్షిణి వద్దకు వచ్చి..పూర్తి వివరాలు తెలుసుకుని..108 వాహనానికి సమాచారం అందించాడు. సమయానికి స్పందించిన 108 సిబ్బంది..హుటాహుటిన వర్షిణి వద్దకు చేరుకుని ఆమెకు వైద్య సహాయం అందించారు. అయితే అప్పటికే పురిటిలో బిడ్డ బయటకు వస్తున్నట్లు వర్షిణి చెప్పడంతో..అప్రమత్తమైన 108 సిబ్బంది కిరణ్ కుమార్, చిరంజీవి..ఆమెకు అంబులెన్సులోనే ప్రసవం చేశారు.

Other Stories: Adidas Bra Add : మహిళల న్యూడ్ ఫొటోలతో యాడ్.. నిషేధం విధింపు

రెండు రోజులుగా ముద్ద కూడా ముట్టని వర్షిణి పరిస్థితి చూసి చలించిపోయిన 108 సిబ్బంది, వెంటనే ఆమెకు పాలు, బ్రెడ్ అందించారు. కట్టుబట్టలతో ఇంటి నుంచి వచ్చిన వర్షిణికి తమ ఇంటిలో నుంచి దుస్తులు తెప్పించి ఇచ్చారు. పుట్టిన ఆడబిడ్డ బరువు తక్కువగా ఉంది. రెండు రోజులుగా ఆహారం లేక వర్షిణి కూడా బాగా నీరసంగా ఉంది. దీంతో తల్లిబిడ్డను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు 108 సిబ్బంది. ఆసుపత్రిలో వివరాల నమోదు సమయంలో తన పేరు కొత్తూరు వర్షిణి అని, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి కూలి పని కోసం భర్తతో కలిసి తిరుపతి వచ్చినట్లు బాధితురాలు వెల్లడించింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది దిశ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వర్షిణి నుంచి పూర్తి వివరాలు సేకరించి, భర్తకు కౌన్సెలింగ్ నిర్వహించి అతని వద్దకు పంపించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.