Maharashtra : పోలీసు పరీక్షలో ఆమెగా పాస్,మెడికల్ టెస్ట్‌లో అతడుగా ఫెయిల్

పోలీసు రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగానికి దరఖాస్తు  చేసుకున్న యువతి మెడికల్ టెస్టుల్లో అతడు అని తేలటంతో ఆమె ఎంపిక సందిగ్దంలో పడింది. 

Maharashtra : పోలీసు పరీక్షలో ఆమెగా పాస్,మెడికల్ టెస్ట్‌లో అతడుగా ఫెయిల్

Maharashtra

Maharashtra :  పోలీసు రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగానికి దరఖాస్తు  చేసుకున్న యువతి మెడికల్ టెస్టుల్లో అతడు అని తేలటంతో ఆమె ఎంపిక సందిగ్దంలో పడింది.  దీంతో కోర్టుకు వెళ్లిన ఆమె, కేసు గెలిచి ఉద్యోగంలో చేరుతోంది.

మహారాష్ట్రంలోని నాసిక్ రూరల్ పోలీసు రిక్రూట్ మెంట్ 2018 లో ప్రకటించిన ఉద్యోగాల కోసం ఎస్సీ కోటా కింద ఒక యువతి (23) దరఖాస్తు చేసుకుంది. రాత పరీక్ష, ఫిజికల్ పరీక్షలన్నింటిలో ఆమె ఉత్తీర్ణత సాధించింది. అయితే వైద్య పరీక్షల్లో ఆమెకు జననాంగాలు లేవని వైద్యులు  గుర్తించారు.

మరో పరీక్షలో ఆమెలో ఆడ-మగ క్రోమోజోమ్స్ ఉన్నట్లు తేలటంతో ఆమెను  పురుషుడిగా పేర్కోంటూ ఉద్యోగానికి  ఎంపిక  చేయకుండా పక్కన పెట్టారు. లింగనిర్ధారణ పరీక్ష కారణంగా తనకు ఉద్యోగం రాకపోవటంతో ఆ యువతి బాంబే హై కోర్టును ఆశ్రయించింది.  తాను పుట్టినప్పటి  నుంచి స్త్రీ గానే పెరిగానని.. తన శరీరంలోని లోపాలపై తనకు అవగాహానలేదని..చదువు కూడా అలాగే కొనసాగిందని ఈ పరిస్ధితుల్లో తనకు న్యాయం చేయాలని కోరింది.

కార్బోటైపింగ్ క్రోమోజోమ్ టెస్ట్ ల  ద్వారా ఆమెను పురుషుడిగా నిర్ధారించటం ఏ మాత్రం సరికాదని ఇద్దరు న్యాయమూర్తులతో   కూడిన ధర్మాసనం రెండు నెలల్లో ఆమెకు ఉద్యోగం ఇప్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపధ్యంలో ఆమెకు ఉద్యోగం ఇప్పించేందుకు పోలీసు శాఖ సుముఖత వ్యక్తం చేసినట్లు అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోణి హై కోర్టుకు తెలిపారు.

Also Read : Actor Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కు ఈడీ నోటీసులు