అమ్మఒడి : మీ అకౌంట్ లో రూ.15వేలు పడతాయో లేదో తెలుసుకోండి ఇలా

ఏపీ సీఎం జగన్ ప్రకటించిన నవరత్నాల్లో ఒకటి ''అమ్మఒడి''.  సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నవరత్నాలలోని హామీలను ఒక్కొక్కటిగా జగన్ నెరవేరుస్తున్నారు. ఇప్పుడు

  • Edited By: veegamteam , December 27, 2019 / 03:16 AM IST
అమ్మఒడి : మీ అకౌంట్ లో రూ.15వేలు పడతాయో లేదో తెలుసుకోండి ఇలా

ఏపీ సీఎం జగన్ ప్రకటించిన నవరత్నాల్లో ఒకటి ”అమ్మఒడి”.  సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నవరత్నాలలోని హామీలను ఒక్కొక్కటిగా జగన్ నెరవేరుస్తున్నారు. ఇప్పుడు

ఏపీ సీఎం జగన్ ప్రకటించిన నవరత్నాల్లో ఒకటి ”అమ్మఒడి”.  సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నవరత్నాలలోని హామీలను ఒక్కొక్కటిగా జగన్ నెరవేరుస్తున్నారు. ఇప్పుడు అమ్మఒడి పథకం వంతు వచ్చింది. 2020 జనవరి 9 నుంచి ఈ స్కీమ్ అమలు చేయనున్నారు. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థులకు రూ.15వేలు ఆర్ధిక సాయం అందుతుంది. నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు అకౌంట్ లో ఆ అమౌంట్ పడుతుంది. ఇప్పటికే అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. మరి.. అమ్మఒడి పథకానికి అర్హులో కాదో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. దానికి సింపుల్ ప్రాసెస్ ఉంది. ఆన్ లైన్ లో ఆధార్ కార్డు నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. 

”అమ్మఒడి” స్కీమ్ కి అర్హులో కాదో తెలుసుకోవాలంటే ఇలా చేయాలి:
* మొదట http://jaganannaammavodi.ap.gov.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి
* వెబ్ సైట్ ఓపెన్ చేశాక అమ్మఒడి చైల్డ్ స్కీం వివరాలు అనే ఆప్షన్ ను ఓపెన్ చేయాలి
* విద్యార్థి తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి
* ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వా కాప్చా కోడ్ ఎంటర్ చేయాలి
* వివరాలను ఎంటర్ చేయటం ద్వారా అమ్మఒడి పథకానికి అర్హులో కాదో తెలుసుకోవచ్చు.  

కాగా.. ఈ స్కీమ్ కి తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉన్న వారు మాత్రమే అర్హులు. విద్యార్థులకు కనీసం 75శాతం హాజరు ఉండాలి. ఒకవేళ పిల్లలు చదువును మధ్యలో నిలిపివేస్తే ఆ విద్యా సంవత్సరానికి వారు ఈ పథకానికి అనర్హులు. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ రంగ సంస్థ ఉద్యోగులు, పెన్షన్లు అందుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, ఇన్‌కమ్ టాక్స్ చెల్లింపుదారులు ఈ పథకానికి  అనర్హులు. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6,455 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.