Hyderabad Girls: కురచ దుస్తులతో రెచ్చిపోయిన హైదరాబాద్ అమ్మయిలు, పుదుచ్చేరి పోలీసుల వార్నింగ్
కురచ దుస్తులతో పుదుచ్చేరి వీధుల్లో తిరుగుతున్న హైదరాబాద్ యువతులకు అక్కడి పోలీసులు షాక్ ఇచ్చారు.

Puduchery
Hyderabad Girls: కురచ దుస్తులతో పుదుచ్చేరి వీధుల్లో తిరుగుతున్న హైదరాబాద్ యువతులకు అక్కడి పోలీసులు షాక్ ఇచ్చారు. పబ్లిక్ ప్లేసుల్లో ఇటువంటి బట్టలు ఎవరైనా ధరిస్తారా అంటూ పోలీసులు ఆ యువతులకు క్లాస్ పీకగా.. అందుకు తగ్గరీతిలోనే ఆ యువతులు కూడా పోలీసులకు సమాధానం చెప్పడం విశేషం. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న కొందరు యువతులు సరదాగా గడిపేందుకు పుదుచ్చేరి వెళ్లారు. ఈక్రమంలో స్థానిక ఫ్రెంచ్ కాలనీలో తిరుగుతున్న ఆ యువతులను ఇద్దరు పోలీసులు వెంటాడారు. ఇంతలో యువతుల వద్దకు వచ్చిన ఒక పోలీస్ కానిస్టేబుల్.. వారిలో ఒకరి ఫోన్ నెంబర్ తో పాటు ఇతర వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం యువతుల వేషధారణ చూసిన పోలీసులు.. ఇటువంటి బట్టలు వేసుకుని వీధుల్లోకి రాకూడదంటూ సూచించారు.
Also read: Maharashtra I-T Raids : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సోదాలు ఎందుకు లేవు ?
ఇలాంటి బట్టలు వేసుకుని ఎవరైనా వీధుల్లోకి వస్తారా అంటూ ఒక పోలీస్ అధికారి ప్రశ్నించాడు. అయితే తమ వేషధారణలో ఏం తప్పు ఉందో చెప్పాలంటూ ఆ యువతులు ప్రశ్నించారు. ఇక్కడకు వచ్చే విదేశీ పర్యాటకులకు కూడా ఇలాంటి ఆంక్షలే చెబుతున్నారా? తమకు మాత్రమేనా? అంటూ యువతులు పోలీసులను ప్రశ్నించారు. ఇదిలా ఉంటే..వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న తమపై పోలీసుల ప్రవర్తన సరిగా లేదంటూ యువతులు ఆరోపించారు. ఆ ఇద్దరు పోలీసులు వేరే ఉద్దేశంతోనే తమను అడ్డుకున్నారని వారు వాపోయారు. కాగా, యువతులు కురచ దుస్తులు ధరించారంటూ ఫిర్యాదు వచ్చిందని, స్కూల్ పరిసర ప్రాంతాలు కాబట్టి ఇలాంటి దుస్తులు ధరించడానికి వీల్లేదని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Also read: Srabanti Chatterjee : సరదాగా ముంగిసతో ఫోటో దిగిన నటి.. కేసు పెట్టిన పోలీసులు..