Rain Alert : తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు

భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

Rain Alert : తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు

Rain

Telugu States : తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.

Read More : Weather Report: అల్పపీడనం అలెర్ట్.. రెండు రోజులు భారీ వర్షాలు!

దానికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించింది. ఈరెండింటి కారణంగా తెలంగాణలో భారీ వర్షాపడతాయని వాతావరణశాఖ తెలిపింది. చాలాచోట్ల ఆదివారం, సోమవారం, మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది.

Read More : Weather Forecast For Andhra Pradesh : ఏపీలో రాగల 3 రోజులు భారీ వర్షాలు

అల్పపీడనం కారణంగా జనగాం జిల్లా ఘనపూర్, కామారెడ్డిలో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లెలో 6, జగిత్యాల జిల్లా మల్లాపూర్, ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూరులో 4 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.

Read More : Weather Forecast : తెలంగాణలో పెరిగిన చలి…రాగల 3రోజులు రాష్ట్రంలో వర్షాలు

ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, కడప, కర్నూలు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తాయి. తీరం వెంట 40కి.మీ నుంచి 50కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. మత్స్యకారులెవరూ 48గంటల పాటు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.