Sriharikota : శ్రీహరికోట షార్‌లో కరోనా కలకలం.. 12మందికి పాజిటివ్
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్)లో కరోనా కలకలం రేగింది. ఇద్దరు వైద్యులతో సహా 12మందికి పాజిటివ్ తేలింది.

Sriharikota : నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్)లో కరోనా కలకలం రేగింది. ఇద్దరు వైద్యులతో సహా 12మందికి పాజిటివ్ తేలింది. దాంతో షార్ యాజమాన్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత నెల 27వ తేది నుంచి షార్‌లో వరుసగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒమైక్రాన్ వేరియంట్ అయి ఉండొచ్చనే అనుమానంతో షార్ ఉద్యోగులు భయాందోళనలో ఉన్నారు. సూళ్లూరుపేటలోని షార్ ఉద్యోగుల కేఆర్పీ, డీఆర్డీఎల్ లో ఒక్కొక్కరుగా కరోనా బారినపడినట్టు తెలుస్తోంది. షార్ విశ్రాంత ఉద్యోగికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
డిసెంబర్ 27న ఇద్దరికి కరోనా పాజిటివ్ రాగా.. ఆదివారం ఒకరు కరోనా బారినపడినట్టు సమాచారం. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన షార్ ఉద్యోగులు హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో సోమవారం ఒక్కరోజే 10 కరోనా కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,149కి చేరింది. కరోనా నుంచి కోలుకున్న 9 మందిని డిశ్చార్జ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 39,468 మంది కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.
దేశంలో కరోనా కేసుల పెరుగుదలతో ముందు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సెక్రటరీ స్థాయికి దిగువన సిబ్బందిలో 50 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోంకు అనుమతిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వ అన్ని మంత్రిత్వ శాఖలకు తక్షణం వర్తించే ఈ ఆదేశాలు జనవరి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. 50 శాతం మంది మాత్రమే ఆఫీసు విధులకు హాజరు కావాలని, మిగతా సగం మందికి వర్క్ ఫ్రం హోం అమలుచేయాలని సూచించింది. గర్భిణీలు, దివ్యాంగులకు ఆఫీసు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. కంటెయిన్ మెంట్ జోన్లలో నివాసం ఉండే వారికి ఆయా జోన్లను డీనోటిఫై చేసేవరకు ఆఫీసు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు వెల్లడించింది.
Read Also : Offline Payments : ఆర్బీఐ కొత్త ఫ్రేమ్‌వర్క్… ఆఫ్‌లైన్ పేమెంట్లపై రూ. 200 లిమిట్..!
- India Corona: భారీగా పెరిగిన కొవిడ్ పాజిటివ్ కేసులు.. మహారాష్ట్రలో అత్యధికంగా నమోదు..
- Kim Jong-un: మారని కిమ్.. నో వ్యాక్సిన్ అట.. అణుబాంబు వేస్తే కరోనా పోతుందా ఏంది..
- Coronavirus: దేశంలో పెరిగిన కొత్త కొవిడ్ కేసులు.. 20వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
- iPhone 14 : ఐఫోన్ 14 లాంచ్ మరింత ఆలస్యం.. కరోనా కేసుల ఎఫెక్టేనా?
- Coronavirus: కాస్త ఊరట.. భారత్‌లో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు
1Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే.. నేడే ప్రమాణ స్వీకారం: ఫడ్నవీస్ ప్రకటన
2Bunny Vas: మరోసారి కథనే నమ్ముకున్న GA2 పిక్చర్స్
3Oppo Reno 8 Series : ఒప్పో రెనో 8 వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
4Maharashtra: ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌కు లేఖ అందించిన ఫడ్నవీస్, షిండే
5PM Modi will taste Yadamma cooking : ప్రధాని మోడీ సార్ కు వంట చేసే అవకాశం దక్కటం నా అదృష్టం : యాదమ్మ
6Manipur landslide: మణిపూర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు జవాన్లు మృతి.. 45మంది గల్లంతు
7Pigeon Droppings : పావురాల వ్యర్ధాలతో శ్వాసకోశ జబ్బులు!
8Maharashtra: ‘హరహర మహాదేవ..’ అంటూ సీఎం ఉద్ధవ్ రాజీనామాపై హీరోయిన్ కంగన స్పందన
9వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్
10Anupama Parameswaran: కార్తికేయ కోసం ఆ పని ముగించేసిన అనుపమ!
-
Major: మేజర్ కూడా రెడీ.. కాస్కోండి అంటోన్న నెట్‌ఫ్లిక్స్!
-
Rheumatic Fever : చిన్నారుల గుండెపై ప్రభావం చూపే రుమాటిక్ ఫీవర్!
-
Jack Fruit : మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే పనస పండు!
-
Aloo Bukhara : ఆలూ బుఖారాతో అనారోగ్యాలకు చెక్!
-
Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
-
Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
-
Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు