Pawan Kalyan : జనసేన కార్యకర్తపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్.. తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయనున్న పవన్ కళ్యాణ్
ఐదు రోజుల క్రితం శ్రీకాళహస్తిలో సాయి అనే జనసేన కార్యకర్తపై సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్నారు. దీంతో సీఐ అంజూ యాదవ్ పై పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan Kalyan (6)
CI Anju Yadav Attack Janasena Activist : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం తిరుపతికి వెళ్లనున్నారు. శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ నేరుగా జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. తిరుపతి విమానాశ్రయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు జనసైనికులు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.
ఈ మేరకు పవన్ అభిమానులు జిల్లా నలుమూలల నుంచి తిరుపతికి చేరుకుంటున్నారు. ఐదు రోజుల క్రితం శ్రీకాళహస్తిలో సాయి అనే జనసేన కార్యకర్తపై సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్నారు. దీంతో సీఐ అంజూ యాదవ్ పై పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Srikalahasti : జనసేన కార్యకర్తపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్
ఇప్పటివరకు సీఐ అంజూ యాదవ్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల జనసేన కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సీఐ అంజు యాదవ్ వ్యవహారంపై ఇప్పటికే డీజీపీ కార్యాలయానికి తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి నివేదిక పంపారు.