Srisailam Temple: శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త: 5 రోజుల పాటు స్పర్శ దర్శనం

ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు శ్రీశైల మల్లికార్జున స్వామి వారి లింగ స్పర్శదర్శనభాగ్యాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటనలో వివరించారు.

Srisailam Temple: శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త: 5 రోజుల పాటు స్పర్శ దర్శనం

Srisaialm

Srisailam Temple: శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త వినిపించారు ఆలయ అధికారులు. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు శ్రీశైల మల్లికార్జున స్వామి వారి లింగ స్పర్శదర్శనభాగ్యాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు బుధవారం ఓ ప్రకటనలో వివరించారు. దేవదాయశాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులను సంప్రదించిన అనంతరం ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తుల సౌకర్యార్ధమై 5 రోజులపాటు స్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు స్వామివారి స్పర్శదర్శనం తాత్కాలికంగా నిలుపుదల చేయనున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఐదు రోజుల పాటు భక్తులకు స్వామి వారి లింగ దర్శనం కల్పించనున్నారు. కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా స్వామివారి స్పర్శదర్శనాన్ని, గర్భాలయాల అభిషేకాలను గతంలో నిలిపివేశారు.

Also read: TTD : ఉదయాస్తమాన టికెట్లకు ఫుల్ డిమాండ్..కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో స్పర్శదర్శనానికి మరియు గర్భాలయాల అభిషేకాలను గురువారం నుంచి ప్రారంభించనున్నారు. ఐదు రోజులు సామూహిక అభిషేక సేవాకర్తలకు కూడా స్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం కల్పించడం జరుగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. విరామ దర్శన సమయంలోను భక్తులు స్వామివారి స్పర్శదర్శనాన్ని చేసుకోవచ్చు. గురు, శుక్రవారాలలో భక్తులు మధ్యాహ్నం 2.00గం.ల నుండి 3.00గం.ల వరకు ఉచిత స్పర్శదర్శనానికి అవకాశం కల్పించడంతో పాటు ఈ ఐదు రోజులు అన్ని ఆర్జిత సేవలు కూడా యధావిధిగా నిర్వహించబడుతాయని శ్రీశైల ఆలయ అధికారులు పేర్కొన్నారు.

Also read: Deltacron : డెల్టా, ఒమిక్రాన్ కలిస్తే డెల్టాక్రాన్.. ఇదో కొవిడ్ స్ట్రెయిన్.. లక్షణాలేంటి? నిపుణుల మాటల్లోనే..!