Vangaveeti Radha Krishna : రాధా ఆఫీస్ ముందు అనుమానాస్పదంగా టూ వీలర్.. పీఎస్‌కు తరలింపు!

వంగవీటి కార్యాలయం వద్ద గత కొద్దీ రోజుల నుంచి ఓ స్కూటీ పార్క్ చేసి ఉండటంతో అనుమానం వచ్చిన కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Vangaveeti Radha Krishna : రాధా ఆఫీస్ ముందు అనుమానాస్పదంగా టూ వీలర్.. పీఎస్‌కు తరలింపు!

Vangaveeti Radha Krishna (2)

Updated On : December 30, 2021 / 1:35 PM IST

Vangaveeti Radha Krishna : వంగవీటి కార్యాలయం ముందు గత కొద్దీ రోజుల నుంచి ఓ స్కూటీ పార్క్ చేసి ఉంది. అనుమానం వచ్చిన కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యాలయం వద్దకు చేరుకున్న పోలీసులు ఆ స్కూటీని స్వాధీనం చేసుకొని స్టేషన్‌కి తరలించారు. కాగా తనను లేకుండా చేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారంటూ తాజాగా వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపుతున్నాయి.

చదవండి : Vangaveeti Radha: రాధాపై రెక్కీ చేసింది ఎవరు?

అధికార పార్టీకి చెందిన వారే.. రాధా హత్యకు కుట్ర చేస్తున్నారని మాజీ సీఎం చంద్రబాబు తాజాగా ఆరోపించారు. ఇదే అంశంపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖరాశారు. రాధా హత్యకు రెక్కీ నిర్వహించిన వారిని గుర్తించాలని లేఖలో పేర్కొన్నారు. ఇక రాధాకు ఫోన్ చేసి మాట్లాడారు బాబు. ఈ నేపథ్యంలోనే రాధాకు రక్షణగా ప్రభుత్వం 2+2 సెక్యూరిటీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ తనకు వద్దంటూ వెనక్కు పంపాడు రాధా.. కార్యకర్తలు తనను జాగ్రత్తగా కాపాడుకుంటారని తెలిపారు.

చదవండి : Vangaveeti Radha: రాధ చుట్టూ బెజవాడ రాజకీయం.. చంద్రబాబుతో భేటీ!