AP Politics : ఆర్. కృష్ణయ్య బీసీల కోసం పోరాటం చేశారా? వైసీపీలో పదవి కోసం పోరాటం చేశారా? : బుద్దా వెంకన్న

ఆర్. కృష్ణయ్య బీసీల కోసం పోరాటం చేశారా? లేక వైసీపీలో పదవి కోసం పోరాటం చేశారా? అంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.

AP Politics : ఆర్. కృష్ణయ్య బీసీల కోసం పోరాటం చేశారా? వైసీపీలో పదవి కోసం పోరాటం చేశారా? : బుద్దా వెంకన్న

Buddha Venkanna Criticizes Ycp Rajya Sabha Candidate R Krishnaiah ..

AP Politics : బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్యకు వైసీపీ నుంచి రాజ్యసభ సీటు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు చేశారు.ఆర్.కృష్ణయ్య బీసీల కోసం పోరాటం చేశారా? లేక వైసీపీలో పదవి కోసం పోరాటం చేశారా?అంటూ ఎద్దేవా చేశారు. బీసీలకు న్యాయం చేయని వైసీపీ ఇచ్చిన రాజ్యసభ పదవిని ఆర్.కృష్ణయ్య ఎలా స్వీకరిస్తారు?అని ప్రశ్నించారు. బీసీలకు అసలైన న్యాయం చేసింది టీడీపీ మాత్రమేనని స్పష్టం చేసిన బుద్దా బీసీలకు ఎన్టీఆర్ ఎంతో చేశారని ఆ తరువాత చంద్రబాబు మాత్రమే బీసీలకు న్యాయం చేసిన ఘనత దక్కతుంది అని అన్నారు.

కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చి అధికారాలు లేకుండా వారి చేతులు కట్టేసిన ఘతన మాత్రం వైసీపీ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని విమర్శించారు. ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇస్తే బీసీల ఓట్లు అన్ని తమకే పడతాయనే ఆలోచనతోనే జగన్ కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇచ్చారు తప్ప ఇందులో ఆయన పట్లగానీ..బీసీల పట్లగానీ జగన్ కు ఏమాత్రం చిత్తశుద్దిలేదని అన్నారు. కానీ జగన్ ఆశలు నెరవేరవు అని రాష్ట్రంలో బీసీలు అంతా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని స్పష్టంచేశారు. వైసీపీ తల్లక్రింద్రులుగా తపస్సు చేసినా..కొంగజపం చేసినా మరోసారి అధికారంలోకి రావటం కల్ల అంటూ ధీమా వ్యక్తం చేశారు బుద్ధా వెంకన్న. బీసీలను మంత్రులన చేసి అందులో ప్రిన్సిపల్ సెక్రటరీగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారిని నియమిస్తారనీ.. దానికి సంబంధించిన కమిషనర్ ను..డైరెక్టర్ ని కూడా రెడ్డిగార్లను మాత్రమే నియమిస్తారని..ఇక ఆ బీసీ మంత్రికి అధికారం ఎక్కడుంటుంది? అని ప్రశ్నించారు బుద్ధా వెంకన్న.

Also read : AP politics : తాడేపల్లిలో గన్నవరం పంచాయితీ..వల్లభనేని వంశీ..దుట్టా రామచంద్రరావులను పిలిపించిన సీఎం జగన్

అలాగే వైసీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ మంత్రులు చేపట్టిన బస్సు యాత్రపై కూడా బుద్ధా విమర్శలు చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ..అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా ప్రజా యాత్రలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీలు యాత్రలు చేస్తుండగా..అధికార వైసీపీ కూడా ప్రజా యాత్రలకు శ్రీకారం చుట్టింది. మూడేళ్ళుగా చేపట్టిన సంక్షేమన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో సత్తా చాటాలని వైసీపీ భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికార పార్టీ మంత్రులు బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఈమేరకు వైసీపీ అధిష్టానం పూర్తి కార్యాచరణ సిద్ధం చేసింది. మే 26 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు విశాఖపట్నం టూ అనంతపురం బస్సు యాత్ర చేయాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులతో బస్సుయాత్ర నిర్వహించాలని, ఆయా వర్గాల ప్రజలకు ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించాలని పార్టీ ఆదేశించింది. ఈ బస్సు యాత్ర కోసం ఇప్పటికే రెండు ప్రత్యేక బస్సులు సిద్ధం కాగా 17 మంది మంత్రులు యాత్రలో పాల్గొననున్నారు. విశాఖపట్నం నుంచి ప్రారంభమయ్యే బస్సు యాత్ర అనంతపురంలో ముగుస్తుంది. రాష్ట్రంలోని ముఖ్యమైన పట్టణాలు నియోజకవర్గాలు మండల కేంద్రాల మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది. శ్రీకాకుళం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

Also read :  AP politics : వైసీపీ మాజీ ఎమ్మెల్యేల ఆశలు ఫలించేనా? వచ్చే ఎన్నికల్లోనైనా టికెట్ దక్కేనా? ఇతర పదవులైనా ఇస్తారా?..

ఆయా ప్రాంతాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని అధిష్టానం ఆదేశించింది. స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవులు రాజ్యసభ స్థానాల్లో వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నారు మంత్రులు. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల్లో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది వైసీపీ.