Buddha Venkanna: టీవీల్లో కొడాలినానిని చూస్తే పిల్లలు బూచోడు అంటున్నారు: బుద్ధా వెంకన్న

తిన్నింటి వాసాలు లెక్కపెట్టే కొడాలినానిని.. వైకాపా నేతలే అసహ్యించుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Buddha Venkanna: టీవీల్లో కొడాలినానిని చూస్తే పిల్లలు బూచోడు అంటున్నారు: బుద్ధా వెంకన్న

Buddha

Buddha Venkanna: ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్షాల మధ్య పరస్పర మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. టీడీపీ ఏర్పాటు దినోత్సవం సందర్భంగా ఆపార్టీ అధినేత చంద్రబాబు.. మరోసారి ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటూ ప్రజల్లో సెంటిమెంట్ లేవనెత్తుతున్నారని మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బుద్ధా వెంకన్న అమరావతిలో మీడియాతో మాట్లాతు..తిన్నింటి వాసాలు లెక్కపెట్టే కొడాలినానిని.. వైకాపా నేతలే అసహ్యించుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also read:AP Cabinet: ఏపీ కొత్త కేబినెట్ ఏర్పాటుకు కౌంట్ డౌన్ మొదలు

టీవీల్లో కొడాలినానిని చూస్తే బూచోడు అంటూ పిల్లలు, తల్లిదండ్రులు భయపడుతున్నారని వెంకన్న ఎద్దేవా చేశారు. “సినిమా ప్రారంభం ముందు వచ్చే ఖైనీ, గుట్కా ప్రకటనలు తొలగించి ఆ ప్లేస్ లో కొడాలినాని ప్రకటనలివ్వాలి” అంటూ మంత్రి కొడాలి నానిపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు బుద్ధా వెంకన్న. హరికృష్ణ ఇమేజ్ ని డామేజ్ చేసి వెన్నుపోటు పొడిచిన కొడాలినానిని రాష్ట్ర ప్రజలు ఓ చీడపురుగులా చూస్తున్నారని బుద్ధా వెంకన్న అన్నారు. “చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ చనిపోయాడని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవ్వరైనా చెప్పారా ? అలా ఎవరైనా చెప్తే రాష్ట్రం విడిచి వెళ్లిపోతా” అంటూ వెంకన్న సంచలన సవాల్ విసిరారు.

Also read:Drunken Drive: డ్రంకెన్ డ్రైవ్‌లో MLA అనుచరులమంటూ హంగామా

420 పార్టీ అయిన వైకాపాలో కొడాలినాని ఓ 840 అని..వైకాపా పుట్టుకే 420ల నుంచి ఏర్పడిందన్న విషయాన్ని కొడాలినాని మరిచాడా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బుద్ధా వెంకన్న. రానున్న వైకాపా కేబినెట్ విస్తరణలో మంత్రిపదవి పోతే విశ్వరూపం చూపిస్తానంటూ కొడాలినాని జగన్మోహన్ రెడ్డికి పరోక్ష హెచ్చరికలు పంపాడని బుద్ధా వెంకన్న అన్నారు. జగన్మోహన్ రెడ్డిలా తండ్రి అధికారం పెట్టుకుని ప్రజా ధనం దోచుకునే బుద్ధి ఎన్టీఆర్ పిల్లలెవ్వరికీ లేదని వెంకన్న పేర్కొన్నారు. వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డే హత్య చేయించాడని వివేకా కుటుంబ సభ్యులంతా చెప్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు.

Also read:AP Electricity Charges : ఏపీలో భారీగా విద్యుత్ ఛార్జీల పెంపు.. ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్