MLA BalaKrishna: నా పోరాటం అన్‌స్టాపబుల్.. అవసరమైతే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా – బాలయ్య

హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు(4 ఫిబ్రవరి 2022) హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మౌన దీక్ష చేపట్టారు.

MLA BalaKrishna: నా పోరాటం అన్‌స్టాపబుల్.. అవసరమైతే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా – బాలయ్య

Balakrishna

MLA BalaKrishna: హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు(4 ఫిబ్రవరి 2022) హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మౌన దీక్ష చేపట్టారు.

హిందూపురం కోసం దేనికైనా సిద్ధమని ప్రకటించిన బాలకృష్ణ.. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. అన్ని వసతులు ఉన్న హిందూపురన్నే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. బాలకృష్ణ దీక్షలో వైసీపీ నాయుకులు కూడా ఉండటం విశేషం.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై రగడ తారాస్థాయికి చేరుకుంటోండగా.. రాత్రికిరాత్రే ప్రభుత్వం కొత్త జిల్లాల ప్ర‌క‌ట‌న చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టిస్తే ఎన్నో లాభాలు ఉన్నాయ‌ని చెప్పారు. ఆధ్యాత్మిక అంశాలకు కేంద్రం స‌త్య‌సాయియని, ఆధ్యాత్మిక‌త ఆధారంగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే ధ‌ర్నాలు చేయ‌బోర‌ని ప్రభుత్వం భావిస్తోంద‌ని ఆరోపించారు.

అయితే, త‌న‌కంటే అధికంగా ఆధ్యాత్మిక చింత‌న ఎవ‌రికైనా ఉందా? అని ప్ర‌శ్నించారు బాలకృష్ణ. హిందూపురం కోసం మాత్రం అన్‌స్టాపబుల్‌గా పోరాడ‌తాన‌ని హామీ ఇచ్చారు బాలకృష్ణ.

ఈ ప్రాంతం కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌మ‌ని, హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తే ఆధ్యాత్మికంగానూ, సామాజికంగా స‌రిపోతుంద‌ని చెప్పారు బాలకృష్ణ. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించే వ‌ర‌కు ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తామ‌ని వెల్లడించారు.

అంతేకాదు.. ఉద్యోగుల ఆందోళ‌నని మ‌ళ్లించేందుకే ఆఘమేఘాలపై కొత్త‌ జిల్లాల ఏర్పాటును ప్రకటించారని, తెలుగుదేశం హయాంలో కడప జిల్లాకు ఉన్న వైఎస్ఆర్ పేరును అలాగే ఉంచలేదా? అని ప్రశ్నించారు. త‌మ డిమాండ్ నెర‌వేర్చ‌క‌పోతే మాత్రం ధ‌ర్నాకు వెనకాడబోమని, ఎవ‌డొచ్చి ఆపుతాడో చూస్తాన‌న్నారు.