Teachers’ Unions : సిపిఎస్ రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాల ఆందోళన

అధికారంలోకి వచ్చిన వారం లోపు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన సీఎం జగన్ నోరు మెదపటం లేదంటూ ఉపాద్యాయు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సిపిఎస్ రద్దు చేయాలని ఉపాద్యాయు సంఘాలు అందోళనకు దిగాయి.

Teachers’ Unions : సిపిఎస్ రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాల ఆందోళన

Teachers

Teachers’ unions protest : సిపిఎస్ రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు విజయవాడలో ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ పాదయాత్ర సమయంలో సిపిఎస్ ను రద్దు చేస్తామని హమీ ఇచ్చారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వారం లోపు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన సీఎం జగన్ నోరు మెదపటం లేదంటూ ఉపాద్యాయు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సిపిఎస్ రద్దు చేయాలని ఉపాద్యాయు సంఘాలు అందోళనకు దిగాయి. గతంలో మార్చ్ 31 లోపు రోడ్ మ్యాప్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఈనెల 18 నుండి రాష్ట్ర వ్యాప్తంగా యూటీఫ్ నాయకులు బైక్ ర్యాలీ లు నిర్వహించారు. సీఎం నిర్ణయం తీసుకోకపోతే ఈ బైక్ లతో సీఎంఓను చుట్టు ముడతామని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు విజయవాడ చేరుకున్నాయి. సీఎం క్యాంపు కార్యాలయం ముందు వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు.

Maoists Set Fire Bus : ఏపీలో మావోయిస్టుల దుశ్చర్య.. బస్సును దగ్ధం చేసిన మావోలు

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ట్రైన్స్ దిగి వస్తున్న ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణీకుల వద్ద నుండి ఓటర్ ఐడీ కార్డు, బ్యాగులు తనిఖీ చేస్తున్నారు. వివిధ రూపాల్లో ట్రైన్స్ లో ఉపాధ్యాయలు, సంఘాలు నాయకులు విజయవాడ చేరుకున్నారు.

తమ బిడ్డకు నీట్ పరీక్ష ఉంది.. అందువలన విజయవాడ చేరుకున్నాను.. సిపిఎస్ ఆందోళన గురించి తమకు ఏమీ తెలీదు అని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. కాగా, వచ్చినవారిని వచ్చినట్టు పోలీసులు.. పోలీసు వాహనాల్లో ఎక్కిస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు ఏ రూపంలో వచ్చినా పోలీసులు అడ్డుకుంటున్నారు.