Tribal Food : ఏపీలో ఉంటున్న వీరికి కరోనా రాలేదు..ఎందుకు ? ఏం తింటున్నారు ?

విజయనగరం జిల్లాలో కోవిడ్ విజృంభిస్తోంది. పట్టణాలు, నగరాల్లో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. అయితే..గిరిజన గ్రామాలను మాత్రం మహమ్మారి టచ్ చేయడం లేదు.

Tribal Food : ఏపీలో ఉంటున్న వీరికి కరోనా రాలేదు..ఎందుకు ? ఏం తింటున్నారు ?

Vizayanagaram

Kurupam Tribal : విజయనగరం జిల్లాలో కోవిడ్ విజృంభిస్తోంది. పట్టణాలు, నగరాల్లో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. అయితే..గిరిజన గ్రామాలను మాత్రం మహమ్మారి టచ్ చేయడం లేదు. ఇదెలా అని అధికారులే ఆశ్చర్యపోతున్నారు. కారణాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కురుపాం నియోజకవర్గంలోని రాయగడ జమ్ము, మొరమగూడ, పి.ఆమిటి, పల్లంబారిడి, సంతోష్ పురం గిరిజన గ్రామాలకు ఇంతవరకు కరోనా సోకలేదు.

అక్కడ ఒక్కటంటే ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. మైదాన ప్రాంతాలకు దూరంగా… గిరి శిఖరాలపై ఉన్న గ్రామాలు. అందరిలాగే వివిధ పనుల నిమిత్తం పట్టణ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అయినా వీరిలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదు. కరోనా కేసులు నమోదుకాకపోవడానికి.. అక్కడి ప్రజల జీవన విధానమే కారణంగా తెలుస్తోంది. వారి ఆహార అలవాట్లే వారిని ఆరోగ్యంగా ఉంచుతున్నాయి. మాములుగా వీళ్లంతా దంపుడు బియ్యం తింటారు. పని అయిన తర్వాత చేతులను వేపాకుతో శుభ్రం చేసుకోవడం ఆనవాయితీ.

జీలుగ కల్లు కూడా ఉపయోగిస్తారు. ఎక్కడికి వెళ్లాలన్నా కాలి నడకనే వెళతారు. సాధారణ జీవన విధానమే వీరిలో రోగనిరోధక శక్తిని పెంచేవిధంగా ఉంటుంది. ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా.. సేంద్రీయ ఎరువులతో పండించే కూరగాయలను తింటుంటారు. శారీరక శ్రమ కూడా తోడవడంతో.. రోగనిరోధక శక్తి కూడా పెరిగి ఎలాంటి వైరస్‌లనైనా తట్టుకునే స్వభావం వారికి వస్తోంది.

కరోనా ఎంటర్ అయిన తర్వాత వీరంతా పక్క గ్రామాలు, మైదాన ప్రాంతాలకు రాకపోకలు తగ్గించారు. తమ గ్రామాలకు ఎవరినీ రానీయకుండా కట్టడి చేయడమే కాకుండా.. వారు కూడా వేరే ప్రాంతాలకు వెళ్లకుండా ఉన్నారు. దీంతో ఇంతవరకు వైరస్ బారిన పడకుండా ఉండగలిగారని పలువురు వైద్యాధికారులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు అంటున్నారు.