Increased Devotees On Tirumala : తిరుమల కొండపై అనూహ్యంగా పెరిగిన రద్దీ.. మూడు కిలోమీటర్ల మేర బారులు తీరిన భక్తులు
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. నిన్నటి నుంచి పెరటాసి నెల మొదలుకావడం.. మరోవైపు వీకెండ్ కావడంతో కొండపైకి భక్తుల రాక పెరిగింది. దీంతో శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అన్నప్రసాద భవనం, లడ్డూకౌంటర్, అఖిలాండం, బస్టాండ్, వైకుంఠం క్యూకాంప్లెక్స్ వంటి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Increased Devotees On Tirumala
Increased Devotees On Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. నిన్నటి నుంచి పెరటాసి నెల మొదలుకావడం.. మరోవైపు వీకెండ్ కావడంతో కొండపైకి భక్తుల రాక పెరిగింది. దీంతో శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అన్నప్రసాద భవనం, లడ్డూకౌంటర్, అఖిలాండం, బస్టాండ్, వైకుంఠం క్యూకాంప్లెక్స్ వంటి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుఠం క్యూకాంప్లెక్స్‌లోని మొత్తం కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.
మూడు కిలోమీటర్ల వరకూ భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 20-22 గంటల సమయం పడుతుంది. రద్దీ పెరగడంతో గదులకు డిమాండ్ పెరిగింది. గదుల కేటాయింపు కేంద్రాల వద్ద భక్తులు బారులు తీరారు. తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు కూడా కిటకిటలాడాయి.
మరోవైపు సర్వదర్శన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండిపోయాయి. ఎస్‌ఎంసీ జనరేటర్, లేపాక్షి, షాపింగ్ కాంప్లెక్స్ మీదుగా రాంభగీచా కాటేజీల వరకు క్యూలైన్లలో దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.