Vangaveeti Radha Marriage: ఘనంగా వంగవీటి రాధా వివాహ వేడుక.. హాజరైన పవన్ కల్యాణ్, పలువురు ప్రముఖులు
వంగవీటి రాధా - పుష్పవల్లి వివాహ వేడుకలో రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

Vangaveeti Radha Marriage
Vangaveeti Radha Marriage: దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ – పుష్పవల్లిల వివాహ వేడుక ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. కృష్ణా జిల్లా పోరంకిలోని ఎం రిసార్ట్స్ లో జరిగిన ఈ వివాహ వేడుకకు భారీ సంఖ్యలో ప్రముఖులు తరలివచ్చి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

Vangaveeti Radha Marriage
జనసేన అధినేత పవన్ కల్యాణ్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ లు వివాహ వేడుకలో పాల్గొని వంగవీటి రాధా – పుష్పవల్లి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జనసేన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.

Vangaveeti Radha Marriage
వంగవీటి రాధా – పుష్పవల్లి వివాహ వేడుకలో రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకలో పాల్గొన్న వారిలో బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు కొడాలి నాని, కొలుసు పార్థసారథి, వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, జలీల్ ఖాన్, బోడే ప్రసాద్ తో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. వంగవీటి కుటుంబం అభిమానులు పెద్ద సంఖ్యలో వివాహ వేడుకలొ పాల్గొన్నారు.

Vangaveeti Radha Marriage
వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి 2004లో పోటీచేసి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో విజయం సాధించారు. ఆ తరువాత పలుసార్లు పోటీ చేసినప్పటికీ అసెంబ్లీలో అడుగుపెట్టలేక పోయారు. రాధాకృష్ణ సతీమణి పుష్పవల్లి నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాణిల కుమార్తె.