Covid Crisis: కరోనా సంక్షోభంలో ఏపీలో వాహన విక్రయాల రికార్డు…

Covid Crisis: కరోనా సంక్షోభంలో ఏపీలో వాహన విక్రయాల రికార్డు…

Vehicles Sales Record, Andhra Pradesh Covid Cases, Covid Crisis

Vehicles Sales Record Andhra Pradesh  : ఏపీ రాష్ట్రంలో వాణిజ్య, వ్యవసాయ వాహన విక్రయాలు భారీగా పెరిగాయి. గతేడాది మార్చితో పోల్చితే ఈ ఏడాది మార్చిలో పెద్ద ఎత్తున వాహనాల అమ్మకాలు జరిగాయి. వాణిజ్య అవసరాల నిమిత్తం ఈ ఏడాది మార్చిలో 1,366 ట్రాక్టర్లు, ప్రైవేట్‌ వినియోగానికి మరో 1,891 ట్రాక్టర్లను ప్రజలు కొనుగోలు చేశారు. అలాగే వ్యవసాయ అవసరాల కోసం ఈ ఏడాది మార్చిలో 430 ట్రిల్లర్లు, వాణిజ్య అవసరాల కోసం మరో 960 ట్రిల్లర్లను కొన్నారు.

ఆటోల విక్రయాలు అయితే ఈసారి భారీగా పెరిగాయి. గతేడాది మార్చిలో కేవలం 158 ఆటోల విక్రయాలు జరగ్గా.. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 1,842 ఆటోలను విక్రయించారు. అలాగే మోటారు సైకిళ్లు, కార్ల అమ్మకాలు కూడా గతేడాది మార్చితో పోల్చితే.. ఈ ఏడాది మార్చిలో పెరిగాయి. మొత్తం మీద గతేడాది మార్చిలో 32,814 వాహనాలను విక్రయించగా.. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 84,509 వాహనాలను విక్రయించారు.