ఉగాది నుంచి పరిపాలనా రాజధానిగా విశాఖ : మంత్రి బొత్స

ఉగాది నుంచి పరిపాలనా రాజధానిగా విశాఖ :  మంత్రి బొత్స

Updated On : January 2, 2021 / 2:53 PM IST

Visakhapatnam administrative capital from Ugadi : తెలుగు కొత్త సంవత్సం ఉగాది నుంచి విశాఖ…పరిపాలనా రాజధానిగా ఉండనుంది. ఉగాది నుంచి విశాఖలో పరిపాలనా రాజధాని ఉంటుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. చట్ట పరంగా ఉగాది నుంచి విశాఖ రాజధానిగా పరిపాలన సాగుతుందన్నారు.

రామతీర్థం ఘటనపై టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. ముమ్మాటికీ కుట్ర కోణం..రాజకీయ కోణం ఉందన్నారు. చంద్రబాబు వెళ్లి చూస్తే తమకేంటని పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో వివరాలు బయటకి వస్తాయన్నారు.

అశోక్ గజపతిరాజు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. రామతీర్థం అభివృద్ధి చేసింది తన భార్య అని తెలిపారు. అశోక్ గజపతిరాజు ట్రస్టుగా ఉండి కూడా ఏమీ చేయలేదని విమర్శించారు.