Andhra Pradesh : చంపేస్తామంటూ వైసీపీ నాయకుల బెదిరింపులు..వలంటీర్ ఆత్మహత్య

చిత్తూరు జిల్లాల్లోని చిత్తూరులోని జోగుకాలనీలో వలంటీర్ గా పనిచేస్తున్న శరవణ అనే వలంటీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు వైసీపీ నాయకులే కారణం అని సూసైడ్ నోట్ లో పేర్కొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Andhra Pradesh : చంపేస్తామంటూ వైసీపీ నాయకుల బెదిరింపులు..వలంటీర్ ఆత్మహత్య

Andhra Pradesh : ఏపీలో వలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. కానీ వలంటీర్లు స్వతంత్రంగా పనిచేసుకోగలుగుతున్నారా?వలంటీర్లపై వైసీపీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారా? వలంటీర్లపై వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారా? అంటే నిజమేననంటోందో ఓ వలంటీర్ ఆత్మహత్య చేసుకున్న దారుణ పరిస్థితి. చిత్తూరు జిల్లాలో ఓ వలంటీర్ ఆత్మహత్ చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ వలంటీర్ ఏదో ఆర్థిక కారణాలతోనే లేదా కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్య చేసుకోలేదని..తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగిన వలంటీర్ ను చంపేస్తామని బెదిరించటం వల్లేనని సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది.

చిత్తూరు జిల్లాల్లోని చిత్తూరులోని జోగుకాలనీలో వలంటీర్ గా పనిచేస్తున్న శరవణ అనే వలంటీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు వైసీపీ నాయకులే కారణం అని సూసైడ్ నోట్ లో పేర్కొన్ని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ వద్ద డబ్బులు అప్పుగా తీసుకున్న ఓ వైసీపీ నాయకుడు సయ్యద్ తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమని అడిగినందుకు..నన్నే డబ్బులు అడుగుతావా? మరోసారి నన్ను డబ్బులు అడిగావంటే నీ కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తాను చంపుతాను అని బెదిరించారని సూసైడ్ నోట్ లో రాసాడు.

ఆదివారం (జనవరి 8,2023) ఆత్మహత్య చేసుకున్న శరవణ తాను ఎవరు ఎవరికి ఎంతెంత డబ్బు ఇచ్చాడు?ఎవరు తనను బెదిరించారు?వారి పేర్లు, వివరాలు అన్నీ శరవణ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. నా ఆత్మహత్యకు కారణం వీరే అంటూ రాశాడు. అనంతరం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారి కుటుంబం అంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాము కష్టపడి సంపాదించిన డబ్బులు అన్నీ మీకే ఇచ్చాము ఇప్పుడు మా మనిషినే బలి తీసుకున్నారు అంటూ శరవణ కుటుంబ సభ్యులు డబ్బులు తీసుకున్న వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్న డబ్బులు అడిగితే ఏకంగా కుటుంబాన్నే చంపేస్తామని బెదిరిస్తారా? మీరు మనుషషులేనా అంటూ నిలదీస్తున్నారు వలంటీర్ శరవణ కుటుంబసభ్యులు.

గతంలో కూడా పలువురు వలంటీర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రకాశం జిల్లాలో కూడా ఓ మహిళా వలంటీర్ ఆత్మహత్య చేసుకుంది. వేలాదిగా వచ్చిన స్థలాలకు చెందిన దరఖాస్తులు మరునాటికే పూర్తి చేయాలని పైఅధికారి ఆదేశించటంతో పని ఒత్తిడికితో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిసింది.