Chittoor : ప్రేమ, పెళ్లి, భర్త కళ్లెదుటే పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న భార్య

ప్రేమించుకున్నారు. పెద్దలు కాదన్నా ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. తను నమ్మిన వ్యక్తి జీవితాంతం కష్టాలు లేకుండా చూసుకుంటాడని ఆ యువతి మురిసింది. ఎన్నో ఆశలతో కాపురం మొదలుపెట్టారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. రెండేళ్లు తిరిగే సరికి ఇద్దరి మద్య గొడవ. తనను ప్రేమించిన వ్యక్తే తన పాలిట మృత్యువులా మారుతాడని ఊహించలేదు.

Chittoor : ప్రేమ, పెళ్లి, భర్త కళ్లెదుటే పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న భార్య

Fire

Wife Commits Suicide : ప్రేమించుకున్నారు. పెద్దలు కాదన్నా ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. తను నమ్మిన వ్యక్తి జీవితాంతం కష్టాలు లేకుండా చూసుకుంటాడని ఆ యువతి మురిసింది. ఎన్నో ఆశలతో కాపురం మొదలుపెట్టారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. రెండేళ్లు తిరిగే సరికి ఇద్దరి మద్య గొడవ. తనను ప్రేమించిన వ్యక్తే తన పాలిట మృత్యువులా మారుతాడని ఊహించలేదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. అతని ముందే అగ్నికి ఆహుతైంది ఆ మహిళ. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం మునిపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది.

Read More : Covid wave: కరోనా సెకండ్ వేవ్ ముగియలేదు, మూడో వేవ్ ఎప్పుడొస్తుంది? ఎందుకు?

మునిపల్లి గ్రామానికి చెందిన హరిప్రసాద్‌ రెడ్డికి సత్యవాణితో రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. పెద్దలు పెళ్లికి అంగీకరించకున్నా.. ఇద్దరూ కలిసి జీవించాలని భావించి వారినే ఎదిరించారు. చివరికి భర్తతో కలిసి సత్యవాణి అత్త వారి ఇంటికి వెళ్లిపోయింది. హరిప్రసాద్‌ రెడ్డి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే రెండేళ్లు తిరిగే సరికి ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అంతగా ప్రేమించుకున్న ఇద్దరు.. కనీసం రెండు సంవత్సరాలు కూడా కలిసి ఉండలేకపోయారు. ఒకరి మీద ఒకరు కోపంతో వేర్వేరుగా నివసిస్తున్నారు.

Read More : మరో రెండు వారాల్లో భూమి మీదకు గ్రహాంతర వాసులు..!

తన భర్త ప్రవర్తన మారకపోవడంతో సత్యవాణి తీవ్రంగా కుమిలిపోయింది. అందర్నీ వదులుకొని అతని కోసం వస్తే.. తనను మధ్యలోనే వదిలేశాడని బాధపడింది. దీంతో తాడో పేడో తేల్చుకోవాలని భర్త ఇంటికి వచ్చేసింది. ఆ సమయంలో కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అప్పటికే తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పు అంటించుకుంది సత్యవాణి. ఇది చూసిన హరిప్రసాద్‌ రెడ్డి షాకయ్యాడు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే సత్యవాణి సజీవదహనం అయ్యింది. భర్తకు కూడా గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

Read More : Tirumala : తిరుమలలో గరుడ వాహనంపై విహరించిన శ్రీవారు