Tadipatri : ప్రియుడితో కలిసి సొంతింట్లోనే చోరీ..ఆ తర్వాత

ప్రియుడితో కలిసి సొంతిట్లోనే చోరీకి పాల్పడిందో ఓ మహిళ. అనంతరం టైం చూసి జంప్ అయ్యింది. దాదాపు రూ. 7.50 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాల చోరీకి సంబంధించిన కేసులు విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.

10TV Telugu News

Woman Cheated Family : ప్రియుడితో కలిసి సొంతిట్లోనే చోరీకి పాల్పడిందో ఓ మహిళ. అనంతరం టైం చూసి జంప్ అయ్యింది. దాదాపు రూ. 7.50 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాల చోరీకి సంబంధించిన కేసులు విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. ఈ ఘటన తాడిపత్రిలో చోటు చేసుకుంది. బంగారం అపహరణ కేసులో మిస్టరీని చేధించిన సీఐ, ఎస్ఐతో పాటు కానిస్టేబేళ్లను ఎస్పీ ఫక్కీరప్ప అభినందించారు. దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ వీఎన్ కే చైతన్య మీడియాకు వివరించారు.

Read More : Tamarind Tree : చింతచిగురుతో..ఆరోగ్య ప్రయోజనాలు

రూ. 7.50 లక్షలు విలువ చేసే ఆభరణాల చోరీ :-
తాడిపత్రి పట్టణంలోని నంద్యాల రోడ్డు సమీపంలో హజీవలీ, షాజహాన్ సోదరులు నివాసం ఉంటున్నారు. అయితే..ఈ సంవత్సరం మే 22వ తేదీన రెండు ఇళ్లలో రూ. 7.50 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. షాజహాన్ కు షాహీనాతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే..స్థానికంగా ఉండే బాలబ్రహ్మయ్యతో షాహీనాకు వివాహేతర సంబంధం ఉంది. కలిసి ఉండాలని వీరు నిర్ణయించుకున్నారు.

Read More : Mann Ki Baat : 75 ఏళ్ల స్వాతంత్ర్యానికి గుర్తుగా “అమృత్ మహోత్సవ్” కార్యక్రమం

భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు :-
దీంతో వీరు పథకం పన్నారు. మే 22వ తేదీన ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు పొరుగున ఉన్న బావ ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేసి బ్రహ్మయ్యకు అందచేసింది. అనంతరం ఏమీ తెలియని దానిలా ఇంట్లోనే ఉండిపోయింది. అదే నెల 28వ తేదీన కుమార్తెతో కలిసి షాహీనా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దీంతో తన భార్య కనిపించడం లేదంటూ..షాజహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు షాహీనాపై అనుమానం కలిగింది. ప్రకాశం జిల్లా మార్టూరులో షాహీనా ఉందని సమాచారం అందింది.

Read More : Tokyo Olympics 2020: తొలి రౌండ్‌లో గెలిచిన మేరీ కోమ్.. తర్వాతి రౌండ్‌కు మనీకా

మార్టూరులో ప్రియుడితో :-
ఈ నెల 23వ తేదీన మార్టూరుకు చేరుకుని షాహీనాతో పాటు ఆమె ప్రియుడు బాలబ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని తాడిపత్రికి తీసుకొచ్చారు. అనంతరం విచారణలో చోరీ విషయాన్ని ఒప్పుకున్నారు. వీరివద్ద నుంచి చోరీ చేసుకెళ్లిన 16 తులాల బంగారు నగలతో పాటు 600 గ్రాముల వెండి ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7.50 లక్షలుగా ఉంటుందని అంచనా. నిందితులపై కేసు నమోదు చేసి…న్యాయమూర్తి ఆదేశాల మేరకు వారిని రిమాండ్ కు తరలించారు.

10TV Telugu News