Andhra pradesh : అరెస్టులతో చిల్లర రాజకీయాలా?ఇలాంటివి స్టూడెంట్‌గా ఉన్నప్పుడే చూశా..భయపడేది లేదు : కోటంరెడ్డి

అక్రమ అరెస్టులతో చిల్లర రాజకీయాలు చేస్తారా? ఇలాంటివి స్టూడెంట్‌గా ఉన్నప్పుడే చూశా..భయం నా బ్లడ్‌లోనే లేదు అంటూ తనపై కేసులు పెట్టి తన అనుచరులను అరెస్ట్ చేయటంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మండిపడ్డారు. షాడో ముఖ్యమంత్రి సజ్జల చేసే ఇటువంటి చిల్లర రాజకీయాలతో నన్ను భయపెట్టలేరని అన్నారు.

Andhra pradesh : అరెస్టులతో చిల్లర రాజకీయాలా?ఇలాంటివి స్టూడెంట్‌గా ఉన్నప్పుడే చూశా..భయపడేది లేదు : కోటంరెడ్డి

YCP MLA kotamreddy sridhar reddy ones more fire on Govt

Andhra pradesh : వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి ప్రభుత్వంపై మండిపడ్డారు. తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని వ్యాఖ్యలు చేసినప్పటినుంచి తనపై కక్షకట్టారని..తనపై అక్రమ కేసులు పెట్టటంతో పాటు తన అనుచరులపై కూడా అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇలా ఎన్ని కేసులు పెట్టినా తాను గానీ..తన అనుచరులు గానీ ఏమాత్రం భయపడేది లేదని స్పష్టంచేశారు కోటంరెడ్డి. సీఎం జగనే అయినా షాడో ముఖ్యమంత్రి మాత్రం సజ్జలేనని ఆయనే ఆదేశాలతోనే తనపై పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారని..తనను భయపెట్టటానికి చూస్తున్నారని ఇటువంటి చిల్లర రాజకీయాలన్నీ నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడే చూశానని భయం అనేది నా బ్లడ్ లోనే లేదంటూ మండిపడ్డారు కోటంరెడ్డి. నన్ను కేసులతో బెదిరించాలని నాలుగు నెలల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు కొత్తగా కేసులు పెట్టారు అంటూ మండిపడ్డారు.

నా ముఖ్య అనుచరుడు తాటి వెంకటేశ్వర రావును అరెస్ట్ చేశారని..అతనితో పాటు జావేద్ లను అరెస్ట్ చేశారని కానీ వీరి అరెస్ట్ లపై పోలీసులు ఎటువంటిసమాచారం ఇవ్వలేదని అన్నారు. నా అనుచరులను అక్రమంగా అరెస్ట్ చేసి హై వే పై ..రాత్రి 11 .30 గంటల వరకూ తిప్పారని వారి కోసం పోలీసు స్టేషన్ కు వెళితే పోలీసులు ఎటువంటి సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. నాపై కేసులు పెట్టటం కాదు అవసరమైతే అరెస్ట్ కూడా చేసుకోండి అయినా నేను భయపడను..నా అనుచరులు కూడా ఇటువంటి అరెస్ట్ లకు భయపడరని భయపడటం అనేది నా బ్లడ్ లోనే లేదన్నారు కోటంరెడ్డి. నా అనుచరులను అరెస్ట్ చేశారని తెలిసి నేను..వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌కు వద్దకు వెళ్లగా అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీఎస్పీ శ్రీనివాసులురెడ్డితో ఫోన్లో కోటంరెడ్డి మాట్లాడారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా భయభ్రాంతులు చేసే రీతిలో అరెస్ట్ చేయడం సరికాదన్నారు. 24 గంటల్లోగా న్యాయస్థానంలో ప్రవేశ పెట్టాలని లేదంటే ఎస్పీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు కోటంరెడ్డి.

ఎప్పుడో నాలుగు నెలల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు నాతో పాటు పదకొండు మంది పై కేసు నమోదు చేశారని తెలిపారు కోటంరెడ్డి. నేనిప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మరాను కాబట్టి నాలుగు నెలల క్రితం కేసు కానిది ఇప్పుడు కేసు అయ్యిందని ఇవి ప్రభుత్వం చేసే వ్యవహరాలు అంటూ మండిపడ్డారు. నా అనుచరులను కూడా నన్ను కూడా అరెస్ట్ చేయండీ అంటూ సవాల్ విసిరారు కోటంరెడ్డి.