YCP Politics : ’యార్లగడ్డ వర్సెస్ వల్లభనేని వంశీ‘ గన్నవరం టికెట్ పై మాటల తూటాలు

ఏపీలోని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కు సంబంధించి యార్లగడ్డ వెంకటరావు, వల్లభనేని వంశీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో గన్నవరం టికెట్ తనదేనని వెంకటరావు అంటుంటే..టికెట్ ఎవ్వరికి ఇవ్వాలో జగన్ కు బాగా తెలుసని..వల్లభనేని సీటు తనకే దక్కుతుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు.

YCP Politics : ’యార్లగడ్డ వర్సెస్ వల్లభనేని వంశీ‘ గన్నవరం టికెట్ పై మాటల తూటాలు

Vallabhaneni Vamshi Counters Yarlagadda Venkat Rao

YCP Politics In Gannavaram : ఏపీలోని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కు సంబంధించి యార్లగడ్డ వెంకటరావు, వల్లభనేని వంశీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో గన్నవరం టికెట్ తనదేనని వెంకటరావు అంటుంటే..టికెట్ ఎవ్వరికి ఇవ్వాలో జగన్ కు బాగా తెలుసని..వల్లభనేని సీటు తనకే దక్కుతుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఉన్నప్పటికీ జగన్ తనకే టికెట్ ఇస్తారన్న నమ్మకం ఉందని..నియోజకవర్గంలోని ప్రతి సమస్యా తనకు తెలుసు అని యార్లగడ్డ చెబుతున్నారు. గన్నవరం పరిధిలో గతంలో ఇసుక దోపిడీ జరిగిందని, దానిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబునుగానీ, జగన్ నుగానీ తాను వ్యక్తిగతంగా తిట్టలేదని, తాను టీడీపీలోకి వెళుతున్నానన్న మాట అబద్ధమని చెప్పారు.

యార్లగడ్డ వ్యాఖ్యలకు వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ మద్దతు తనకే ఉందని ధీమా వ్యక్తంచేశారు. అప్పుడప్పుడు వచ్చిపోయేవారి గురించి తాను అస్సలు పట్టించుకోనని గన్నవరం నియోజక వర్గం ప్రజలకు ఏం చేశానో..ప్రజలను నేను విలన్నో లేదా హీరోనా ప్రజలకే తెలుసునని..ఎవరికి సీటివ్వాలో జగన్ నిర్ణయిస్తారన్నారు. జగన్ పనిచేయాలని సూచించారని, తాను చేస్తున్నానని చెప్పారు. మిగతా వారి గురంచి పార్టీనే చూసుకుంటుందన్నారు. ఎన్నికల ముందు తాజ్ మహల్ కట్టిస్తానని చెప్పినవాళ్లు వెళ్లిపోయారని ఎధ్దేవా చేశారు.

తాను గెలిచినా ఓడినా గన్నవరంలోనే ఉన్నానని చెప్పారు. టీడీపీలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్లు, వైసీపీలో ఉన్నా టీడీపీ వాళ్లూ తన సాయం పొందారని చెప్పుకొచ్చారు. మట్టి తవ్వకాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని.. వంశీ విమర్శించారు. గన్నవరంలోని మట్టిని కుప్పం వరకు ఎలా తరలిస్తామని ప్రశ్నించారు. ఆ మట్టిని అక్కడిదాకా తరలించేందుకు.. ఆ మట్టికన్నా ఎక్కువగా డీజిల్ కే ఖర్చవుతుందని చెప్పారు. ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా ఈ విషయం తెలుస్తుందన్నారు.