YSR Sister Vimalamma : వివేకాను చంపిన వాళ్లు బయటే తిరుగుతున్నారు : వైఎస్సార్ సోదరి విమలమ్మ

వివేకాను చంపివారు బయటే తిరుగుతున్నారంటూ వైఎస్సార్ సోదరి చేసిన సంచలన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

YSR Sister Vimalamma : వివేకాను చంపిన వాళ్లు బయటే తిరుగుతున్నారు : వైఎస్సార్ సోదరి విమలమ్మ

YSR Sister Vimalamma

Updated On : May 24, 2023 / 5:41 PM IST

YS Viveka case YSR Sister Vimalamma : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఎపిసోడ్ ఉత్కంఠ కొనసాగుతున్న క్రమంలో వెఎస్సార్ సోదరి విమలమ్మ మీడియా ముందుకొచ్చారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అవినాశ్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవటానికి వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా  వివేకాను చంపివారు బయటే తిరుగుతున్నారని..అవినాశ్ ఏ తప్పూ చేయలేదని అన్నారు.

అవినాశ్ కు ధైర్యం చెప్పటానికి..అతని తల్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఆమె కోసం దేవుడిని ప్రార్థించటానికి తాను కర్నూలు వచ్చానని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం కష్టాల్లో ఉందని చెప్పుకొచ్చారు. అవినాశ్ తల్లి తన కుమారుడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అనే ఆందోళనతో కృంగిపోయారని ఆమెకు, అవినాశ్ కు ధైర్యం చెప్పటానికివచ్చాన్నారు. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ త్వరలోనే బటయపడతారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్న కాలంలో మా కటుంబాలు అన్నీ చాలా సంతోషంగా ఉండేవని..కానీ ఇప్పుడా పరిస్థితిలేదని వాపోయారు. ఇప్పుడు మా కుటుంబాల్ని చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులు రోజుకో ట్విస్టు కాదు గంటకో ట్విస్టు అన్నట్లుగా మారిపోయింది. వైఎస్ అవినాశ్ తండ్రి ఈకేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఇక అవినాశ్ అరెస్ట్ ఇప్పుడో కాసేపటికో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో  అవినాశ్ రెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం తిరుగుతున్నా ఫలితం దక్కటంలేదు. ఈక్రమంలో  వైఎస్సార్ సోదరి విమలమ్మ వివేకాను చంపివారు బయటే తిరుగుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు  ఆసక్తికలిగిస్తున్నాయి.