MP Nandigam Suresh : వైసీపీ పోవటం తర్వాత నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ గేటు దాటు చూద్దాం : పవన్ కల్యాణ్ కు వైసీపీ ఎంపీ సవాల్

పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని వ్యతిరేకించడం ఏ క్లాస్ వార్..?పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ను వ్యతిరేకించడం ఏ క్లాస్ వార్..?

MP Nandigam Suresh : వైసీపీ పోవటం తర్వాత నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ గేటు దాటు చూద్దాం : పవన్ కల్యాణ్ కు వైసీపీ ఎంపీ సవాల్

nandigam suresh .. Pawan Kalyan

YCP MP Nandigam Suresh : వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై చేసే విమర్శలకు..అంతకు మించి అన్నట్లుగా కౌంటర్లు ఇస్తున్నారు వైసీపీ నేతలు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పవన్ పై విరుచుకుపడుతున్నారు. ప్రతివిమర్శలు, సెటైర్లతో దుయ్యబడుతున్నారు. దీంట్లో భాగంగా వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ పవన్ కల్యాణ్ పై తీవ్రంగా మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తీరు వీధి రౌడీలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదు.. అసాంఘిక శక్తి అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రానికి హానికరమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ తయారయ్యాడు అంటూ మండిపడ్డారు.

MLA Grandhi Srinivas : పవన్ ప్రసంగంలో అన్నీ అబద్దాలే..ప్యాకేజీ పార్టీ అని మరోసారి రుజువు చేసారు : ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

చంద్రబాబు దగ్గర పవన్ చేస్తున్న బానిసత్వానికి అలసట లేదు అంటూ విమర్శించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని వ్యతిరేకించడం ఏ క్లాస్ వార్..?పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ను వ్యతిరేకించడం ఏ క్లాస్ వార్..?పవన్ ఎవరినైనా వ్యక్తిగతంగా మాట్లాడొచ్చా..? అంటూ మండిపడ్డారు. ఆయన్ని ఎవరూ ఏమీ అనకూడదా..?సింగిల్ గా పోటీ చేస్తాం అని చెప్పే దమ్ము పవన్ కి ఉందా..? అంటూ ప్రశ్నించారు.పవన్ కల్యాణ్ ముందు ఎమ్మెల్యే అవ్వడానికి ప్రయత్నం చెయ్యాలి అంటూ సెటైర్లు వేశారు.

పవన్ బెదిరింపులకు బయటపడటానికి ఇది సినిమా కాదన్నారు. పవన్ గొప్పవాడు అయితే రెండు చోట్లా యెందుకు ఓడిపోయాడు..?ఇప్పటికైనా పవన్ మాట్లాడే భాష మార్చుకోవాలి.. బుద్దిగా మాట్లాడితే మంచిది అంటూ సూచించారు.మా పార్టీ నేతల పర్సనల్ విషయాలు నీదగ్గర ఏమున్నాయో బయటపెట్టు..పవన్ కల్యాణ్ ఉడత ఊపులకు భయపడే వ్యక్తి కాదు జగన్ అని..వైసీపీ పోవడం తరవాత పవన్ ముందు ఎమ్మెల్యే గా గెలిచి అసెంబ్లీ గేటు దాటు చూద్దాం అంటూ సవాల్ విసిరారు.

Minister Ambati Rambabu: పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు.. చీడ పురుగు అంటూ ఆగ్రహం..

ఇలా వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చేసే విమర్శలు, సంధించే ప్రశ్నలు వైసీపీ నేతల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. మొత్తంమీద పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఉభయ గోదావరి జిల్లాలతో పాటు మొత్తం రాష్ట్రంలో హీటెక్కిస్తోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయాల్లో పవన్ వారాహి యాత్ర వేడి రాజేస్తోంది.