Home » Author »Narender Thiru
ప్రమఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్ వచ్చే ప్రయత్నాల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. భారత ప్రభుత్వం దిగుమతి సుంకాల్ని తగ్గించాలన్న టెస్లా ప్రతిపాదనపై కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడంతో టెస్లా ఈ నిర్ణయం తీసుకుంది.
తీవ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మరణించారు. జమ్మూ-కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో శుక్రవారం ఈ ఎన్కౌంటర్ జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రం ‘బుద్ధవనం’ శనివారం ప్రారంభం కానుంది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్, టూరిజం మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, విద్యుత్ శాఖా మంత్రి జి.జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో బుద్ధవ�
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించినట్లు యూఏఈ అధికారిక మీడియా వెల్లడించింది. 1948లో జన్మించిన షేక్ ఖలిఫా, 2004లో యూఏఈ అధ్యక్షుడయ్యాడు.
హరియాణాలోని సోనిపట్ సమీపంలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో 12 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. చంఢీఘడ్-ఢిల్లీ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
మూడు రోజులపాటు జరగనున్న కాంగ్రెస్ మేధోమధన సదస్సు ‘నవ సంకల్ప్ చింతన్ శివిర్’ శుక్రవారం రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారీ మార్పులకు పార్టీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థను పునర్వ్యవస్థీకరించాలని అభిప్రాయపడ్డారు ప్రధాని మోదీ. రెండవ గ్లోబల్ కోవిడ్ సమ్మిట్‌లో భాగంగా గురువారం మోదీ, ప్రపంచ దేశాలను ఉద్దేశించి మాట్లాడారు.
రాష్ట్రంలో మత మార్పిడులను నిరోధిస్తూ ఆర్డినెన్స్ తెచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన బిల్లును గత డిసెంబర్లోనే కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది.
ఎక్కువ దూరంలోని లక్ష్యాలను చేధించగల బ్రహ్మోస్ క్షిపణి పరీక్షను భారత్ విజయవంతంగా పరీక్షించింది. సుఖోయ్ ఫైటర్ విమానం నుంచి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను బంగాళాఖాతంలో గురువారం విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ శాఖ వెల్ల�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని మోదీకి లేఖ రాశారు.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్నారు.
జమ్మూ-కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో టెర్రరిస్టులు జరిపిన దాడిలో కశ్మీర్ పండిట్ ఒకరు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడిని రాహుల్ భట్‌గా గుర్తించారు.
శ్రీలంక నూతన ప్రధానిగా విక్రమ సింఘెను నియమించే అవకాశాలున్నట్లు తాజా సమాచారం. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఆయన పదవి చేపట్టబోతున్నారని శ్రీలంక మీడియా వెల్లడించింది.
తాజ్ మహల్లో ఇప్పటివరకు మూసి ఉన్న 22 గదుల్ని తెరిచేలా, పురాతత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రజనీష్ సింగ్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశాడు. ఈ గదుల్లో ఏదో మిస్టరీ ఉందని, హిందూ దేవతలకు చెందిన విగ్రహాలు ఉండొచ్చని, ఈ విషయం తేల్చాలని పిటిషన్లో కోరా�
చదువు, ఉపాధితోపాటు వివిధ అవసరాల కోసం విదేశాలకు వెళ్లేవాళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. తాజా ఆదేశాల ప్రకారం ఇకపై వీళ్లంతా కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కోసం, సెకండ్ డోస్ తర్వాత తొమ్మిది నెలలు ఆగాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలపై ఫిర్యాదు చేసేందుకు 104 కాల్ సెంటర్‌ను వినియోగించనున్నట్లు ప్రకటించారు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు. ఇందుకోసం 104ను బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడబోనని, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డే తన జోలికి రావడానికి భయపడ్డాడని చంద్రబాబు అన్నారు.
కొద్దిసేపట్లో పెళ్లి జరగబోతుండగా పీకలదాకా తాగొచ్చాడు పెళ్లికొడుకు. మద్యం మత్తులో ఉన్న పెళ్లి కొడుకుని చూసి, అతడ్ని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది పెళ్లి కూతురు.
ఈ నెల 18న అంతర్జాతీయ మ్యూజియం డేను పురస్కరించుకుని హైదరాబాద్, సాలార్జంగ్ మ్యూజియంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్ నాగేందర్ రెడ్డి తెలిపారు. దీనికోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణకు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బెయిల్‌పై అప్పీలుకు వెళ్తామని పోలీస్ శాఖ ప్రకటించింది.