Home » Author »Narender Thiru
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ, పోచారం పరిధిలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను అమ్మకానికి పెట్టింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా తాజాగా విడుదలైంది.
అసని తుపాను నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. అత్యవసర సహాయం కోసం 1070, 18004250101 నెంబర్లకు కాల్ చేయాలని ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ, విశాఖ పట్నం సూచించింది.
మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్న వాహనం బోల్తా పడటంతో, స్థానికులు బాటిళ్లు ఎత్తుకెళ్లిన ఘటన తమిళనాడులోని మదురైలో జరిగింది. కేరళలోని మానలూర్ నుంచి పది లక్షల రూపాయల విలువైన మద్యం బాటిళ్లతో ఒక ట్రాలీ వాహనం బుధవారం బయలుదేరింది.
దేశంలో ఇంకా 19 శాతం ఇండ్లకు మరుగుదొడ్లు లేవని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) తేల్చింది. 2019-21 వరకు జరిపిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులోని జెనిన్ పట్టణంలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో అల్ జజీరా ఛానెల్‌కు చెందిన మహిళా జర్నలిస్టు మృతి చెందారు. బుధవారం ఉదయం షిరీన్ అబు అఖ్లే అనే మహిళా జర్నలిస్టు స్థానికంగా జరుగుతున్న ఇజ్రాయెల్ దాడులను �
బుధవారం నుంచి రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ, హైదరాబాద్ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్
అసని తుపాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. కోస్తా జిల్లాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని, ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద తీవ్ర ప్రభావం ఉంటుందని ఆయన హెచ్చరించారు.
మనల్ని చీకటిలోంచి వెలుగులోకి నడిపించిన భాష సంస్కృతం అన్నారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా. శనివారం ఢిల్లీలోని సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
‘జాతీయ నూతన విద్యా విధానం-2020’పై ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైబ్రిడ్ విద్యా విధానాన్ని ఎక్కువగా అమలు చేయాలని సూచించారు.
తిరుమలలో ఈ నెల 25 నుంచి 29 వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
బ్యాంకులను నలభై కోట్ల రూపాయలమేర మోసం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేపై సీబీఐ దాడులు నిర్వహించింది. పంజాబ్‌లోని అమర్‌ఘర్ నియోజకవర్గం నుంచి జశ్వంత్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచాడు.
చత్తీస్ఘడ్ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు మావోయిస్టులు (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా). అయితే, చర్చల ప్రక్రియ కొనసాగాలంటే తాము విధించే కొన్ని షరతులకు అంగీకరించాలని కోరారు.
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు భారతీయులుసహా ఏడుగురిని అమెరికన్ అధికారులు అరెస్టు చేశారు. అమెరికా-కెనడా సరిహద్దులో గత నెల 28న ఈ ఘటన జరిగింది.
ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ బేతంపూర్ సమీపంలో శనివారం ఉదయం తొమ్మిది గంటలకు, పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ఒంటెను ఢీకొంది. దీంతో ఒంటె శరీరం ముక్కలుముక్కలైంది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎమ్.కె.స్టాలిన్ అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతోంది. మొదటి వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కొత్త పథకాలు ప్రకటించారు స్టాలిన్.
బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ ఉద్యోగులు ఆఫీసులో నిద్ర పోయేందుకు అంగీకరించింది. రోజూ అరగంటపాటు నిద్రపోవచ్చని ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చింది.
తెలంగాణలో రెండోరోజు పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ చంచల్‌గూడ జైలులో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలతో ములాఖత్ అయ్యారు. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా చేసిన ఎన్ఎస్యూఐ నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతుండటం, బ్యాటరీలు పేలిపోతుండటానికి బ్యాటరీ తయారీలో లోపాలే కారణమని కేంద్ర ప్రభుత్వ కమిటీ ప్రాథమిక అవగాహనకు వచ్చింది.
ముఖ్యమంత్రులుగా లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ల ముప్పయ్యేళ్ల పాలన తర్వాత కూడా బిహార్ ఇంకా పేద, వెనుకబడిన రాష్ట్రంగానే ఉందన్నారు. శుక్రవారం ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్లో బిహార్ అభివృద్ధిపై స్పందించారు.
‘పుష్ప’ చిత్రంలోని పాటకు విద్యార్థులు డ్యాన్స్ చేయడంతో, ప్రిన్సిపల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన ఒడిశాలోని గాంజాం జిల్లాలో జరిగింది.