Rajiv Swagruha Flats: రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు అమ్మకానికి సిద్దం

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ, పోచారం పరిధిలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను అమ్మకానికి పెట్టింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా తాజాగా విడుదలైంది.

Rajiv Swagruha Flats: రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు అమ్మకానికి సిద్దం

Rajiv Swagruha Flats

Updated On : May 11, 2022 / 7:32 PM IST

Rajiv Swagruha Flats: సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే హైదరాబాద్ వాసులకు హెచ్ఎమ్‌డీఏ శుభవార్త చెప్పింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ, పోచారం పరిధిలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను అమ్మకానికి పెట్టింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా తాజాగా విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. బండ్లగూడలో 419 ఫ్లాట్లు పూర్తిగా సిద్ధమయ్యాయి. మరో 1,082 ఫ్లాట్లు పాక్షికంగా సిద్ధమవ్వగా, ఇంకా పనులు కొనసాగుతున్నాయి. పూర్తిగా సిద్ధమైన ఫ్లాట్ల ధరను చదరపు అడుగుకు రూ.3 వేలుగా, పాక్షికంగా సిద్ధమైన ఫ్లాట్ల ధరను చదరపు అడుగుకు రూ.2,750గా నిర్ణయించింది. పోచారంలో 1,328 ఫ్లాట్లు పూర్తి స్థాయిలో సిద్ధం అయ్యాయి. మరో 142 ఫ్లాట్లలో స్వల్పంగా పనులు మిగిలి ఉన్నాయి.

Hyderabad : ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి అప్పుడే పుట్టిన శిశువు బలి

పూర్తయిన ఫ్లాట్ల ధరను చదరపు అడుగుకు రూ.2,500గా, పాక్షికంగా సిద్ధమైన ఫ్లాట్ల ధరను చదరపు అడుగుకు రూ.2,250గా నిర్ణయించారు. గురువారం, మే 12 నుంచి జూన్‌ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. అర్హత కలిగిన వాళ్లకు మీ సేవ పోర్టల్‌, కంప్యూటర్ ఆధారిత లాటరీ ద్వారా ఫ్లాట్లను కేటాయిస్తారు. స్వగృహ తెలంగాణ వెబ్‌సైట్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 22న లాటరీ ద్వారా ఫ్లాట్ల కేటాయింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము రూ.1,000గా నిర్ణయించారు. ఫ్లాట్ల సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తే లాటరీ పద్ధతి పాటిస్తారు. లాటరీలో ఫ్లాటు కేటాయింపు జరగకపోతే ఫీజు వాపసు ఇవ్వరు. ఎంపికైన వాళ్లకు లోను సౌకర్యం కూడా ఉంటుంది. ఫ్లాట్లలో బెడ్‌రూమ్స్‌తోపాటు, కిచెన్, పూజగది, అటాచ్డ్ బాత్‌రూమ్స్, హాల్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.