Home » Author »Narender Thiru
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇరవై ఏళ్ల యువతిని అపహరించిన నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌లోని జైసినగర్ పట్టణ పరిధిలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పాటైన సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా 15 మంది పేర్లను కేంద్రానికి ప్రతిపాదించింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ.రమణ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కొలీజియం.. జ్యుడీషియల్ అధికారులు, న్యాయవాదులతో కలిపి 15 మం�
దాదాపు 200 మంది తీవ్రవాదులు సరిహద్దు దాటి, జమ్ము-కాశ్మీర్లో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని భారత ఆర్మీ హెచ్చరించింది. ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
గడిచిన ఆరేళ్లలో దాదాపు ఏడున్నర లక్షల మంది పౌరులు భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2016 నుంచి ఏడున్నర లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదులుకోగా, దాదాపు ఆరు వేల మంది విదేశీయులు భారత పౌరసత్వం తీసుకున్నారని కేంద్రం వెల్లడించ
రాజకీయ కక్షతో ప్రభుత్వ పథకాలు అమలుచేయని వాలంటీర్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించింది.
మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కేంద్ర హోం మత్రి అమిత్ షాకు తన ఇంట్లో ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం కోల్‌కతాలోని తన నివాసంలో అమిత్ షాకు ఆతిథ్యం ఇవ్వబోతున్నారు.
రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
జమ్ము-కాశ్మీర్లో తీవ్రవాదులు మెరుగైన ఆయుధాలు వాడుతున్నట్లు సైనికులు గుర్తించారు. తీవ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలిస్తే కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరానికి ఆ పార్టీకి చెందిన లాయర్ల నుంచి నిరసన సెగ ఎదురైంది. చిదంబరం వృత్తిరీత్యా లాయర్ అనే సంగతి తెలిసిందే.
కొంతమంది కేటుగాళ్లు ఏకంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు. ఆయన ప్రొఫైల్ ఫొటో పెట్టుకుని, ఆయన పేరుతోనే కొంతమంది ఎంపీలకు మెసేజ్‌లు కూడా చేస్తున్నారు.
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్) నుంచి క్రెటా నైట్ ఎడిషన్ లాంఛ్ అయింది. ఇప్పటికే మార్కెట్లో క్రెటా కార్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.
కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైను బీజేపీ అధిష్టానం మార్చబోతుందని కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. సీఎం బొమ్మైను మార్చబోవడం లేదని కేంద్రం హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహాను బెదిరించిన జర్నలిస్టుపై చర్యలు తీసుకుంది బీసీసీఐ. జర్నలిస్టు బొరియా మజుందార్‌పై రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. నలుగురి చేతిలో అత్యాచారానికి గురైన బాలిక రేప్ కేసు ఫైల్ చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే, పోలీసు కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు.
వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. బెయిల్ పిటిషన్లో సీబీఐతోపాటు ప్రతివాదిగా ఉన్న వివేకా కుమార్తె సునీత కూడా కోర్టుకు హాజరయ్యారు.
హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. టాంజానియా దేశస్థుడి నుంచి కస్టమ్స్ అధికారులు రూ.11.53 కోట్ల విలువ గల 1389.10 గ్రాముల హెరాయిన్ డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో మంగళవారం లభించిన జంట మృతదేహాలకు సంబంధించిన మిస్టరీ వీడింది. మృతులను పోలీసులు జ్యోతి, యశ్వంత్గా గుర్తించారు.
త్వరలో రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో పర్యటించనున్న నేపథ్యంలో, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద విద్యార్థులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది.
దేశవ్యాప్తంగా మత ఘర్షణల్ని బీజేపీ ప్రోత్సహిస్తోందని, ముఖ్యంగా రాజస్థాన్‌లో ఘర్షణలకు బీజేపీనే కారణమని ఆరోపించారు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్.
తెలంగాణ తెచ్చాను అని చెప్పుకున్న టీఆర్ఎస్కు ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు.