OM Birla: లోక్‌సభ స్పీకర్ పేరుతో ఫేక్ అకౌంట్లు.. ఎంపీలకు మెసేజ్‌లు

కొంతమంది కేటుగాళ్లు ఏకంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు. ఆయన ప్రొఫైల్ ఫొటో పెట్టుకుని, ఆయన పేరుతోనే కొంతమంది ఎంపీలకు మెసేజ్‌లు కూడా చేస్తున్నారు.

OM Birla: లోక్‌సభ స్పీకర్ పేరుతో ఫేక్ అకౌంట్లు.. ఎంపీలకు మెసేజ్‌లు

Om Birla

Updated On : May 4, 2022 / 8:22 PM IST

OM Birla: కొంతమంది కేటుగాళ్లు ఏకంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు. ఆయన ప్రొఫైల్ ఫొటో పెట్టుకుని, ఆయన పేరుతోనే కొంతమంది ఎంపీలకు మెసేజ్‌లు కూడా చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఓం బిర్లా వెల్లడించారు. 7862092008, 9480918183, 9439073870 అనే నెంబర్ల నుంచి ఈ మెసేజ్‌లు వెళ్తున్నాయని ఆయన చెప్పారు.

 

ఎంపీలతోపాటు, మరికొందరు వ్యక్తులకు ఇలా తన పేరుతో మెసేజ్‌లు, కాల్స్ వెళ్తున్నట్లు ఓం బిర్లా పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ నెంబర్ల నుంచి వచ్చే ఎలాంటి కాల్స్, మెసేజ్‌లకు అయినా స్పందించవద్దని ఆయన కోరారు.